భోళా శంకర్ హిందీ రిలీజ్ డేట్

మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన భోళా శంకర్ గత శుక్రవారం విడుదలైంది. బట్ ఆశించినంత హిట్ టాక్ తెచ్చుకోలేదీ సినిమా. ఓ రకంగా డిజాస్టర్ గా తేల్చారు ఆడియన్స్. మొదటి రోజు తర్వాత వెంటనే కలెక్షన్స్ కూడా డౌన్ అయిపోయాయి. అదే కారణంగా చూపిస్తున్నారు. సినిమా బాలేదు అనేకంటే బాలేదంటూ బాకాలు ఊదుతూ ఆనందించేవాళ్లే ఎక్కువగా ఉండటం విశేషం. అయితే డబ్ అయిన సినిమాను రీమేక్ చేయడం ఎంత పెద్దతప్పు అనేది మెగాస్టార్ కు గాడ్ ఫాదర్ తర్వాత మరోసారి అర్థమయ్యేలా చేసిందీ సినిమా.

ఇక్కడ డిజాస్టర్ అయిన ఈ చిత్రాన్ని సడెన్ గా హిందీలో రిలీజ్ చేయాలనే ప్లాన్ చేయడం ఆశ్చర్యమే. ఎందుకంటే ఈ మూవీ రిజల్ట్ ఇప్పుడు దేశమంతా తెలుసు. ఎంత లేదనుకున్నా ఇప్పుడు స్ట్రెయిట్ సినిమాలకే రివ్యూస్ చూసి వెళుతున్నాడు. ఇక డబ్బింగ్ మూవీస్ అంటే ఆగుతారా.. సరే వీరి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చెప్పలేం కానీ ఈ మూవీ హిందీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.


నిజానికి తెలుగులో ఫ్లాప్అయిన చాలా సినిమాలు హిందీలో సూపర్ హిట్ అయిన సందర్భాలున్నాయి. ఈ రకంగా మాస్ ఎంటర్టైనర్స్ తోనే ఇక్కడ చాలా ఫ్లాపులు చూసిన, చూస్తోన్న గోపీచంద్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలకు చాలా పెద్ద హిందీ డబ్బింగ్ మార్కెట్ క్రియేట్ అయింది. నార్త్ ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్, కిక్ ఇచ్చే ఫైట్లు ఉంటే మాగ్జిమం వర్కవుట్ అవుతుంది. మనకు రొటీన్ అయినా వారికి ఇది నచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ మూవీని అక్కడా విడుదల చేస్తున్నారు. ఇక ఈ నెలలోనే 25న భోళా శంకర్ ను హిందీలో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీ అక్కడ హిట్ అయితే నిర్మాత అనిల్ సుంకర కొంత వరకూ సేఫ్ అవుతాడనే చెప్పాలి.

Related Posts