ఆ డిస్ట్రిబ్యూటర్ పై గిల్డ్ వైల్డ్ డెసిషన్

ఏ సినిమా పరిశ్రమలో అయినా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఇష్యూస్ ఉండటం కామన్. కొన్నిసార్లు బయటకు రాకుండానే పరిష్కారం అవుతాయి. మరికొన్నిసార్లు రచ్చకెక్కుతాయి. ఇలాంటి సందర్భాల్లో పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తారు. కాకపోతే అప్పుడప్పుడూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కోర్ట్ కు వెళతారు. అలా రీసెంట్ గా వైజాగ్ నుంచి చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న సతీష్ అనే అతను నిర్మాత అనిల్ సుంకరపై కోర్ట్ లో కేస్ వేశాడు.

అనిల్ సుంకర గత చిత్రాలన్నీ వైజాగ్ ఏరియాలో తానే డిస్ట్రిబ్యూట్ చేశానని.. ఏజెంట్ చిత్రానికి భారీగా నష్టపోయానని.. ఆ నష్టాన్ని పూడ్చేందుకు నెక్ట్స్ సినిమా ఇస్తా అని చెప్పాడనీ.. కానీ భోళా శంకర్ ను తనకు తెలియకుండా, చెప్పుకుండా వేరే వారికి ఇచ్చారని అనిల్ వల్ల భారీగా నష్టపోయిన తనకు న్యాయం చేయాలని కోరుతూ కోర్ట్ కెక్కాడు సదరు డిస్ట్రిబ్యూటర్ సతీష్. సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందు సతీష్ కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది కోర్ట్. అయితే అంతర్గతంగా తేల్చుకోవాల్సిన విషయాన్ని కోర్ట్ వరకూ తీసుకువెళ్లాడనే కోపం పెట్టుకుంది నిర్మాతల గిల్డ్.


తాగాజా తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై సతీష్ కు ఎలాంటి సినిమాలూ డిస్ట్రిబ్యూషన్ కు ఇవ్వొద్దని తీర్మానించుకుంది. నిజానికి ఇది సరైన నిర్ణయమా అంటే కాదు అనే చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్ నష్టపోయినా ఫర్వాలేదు.. నిర్మాత నష్టపోకూడదు అనేలా ఉంది ఈ నిర్ణయం అంటున్నారు కొందరు. మరికొందరు మాత్రం సతీష్ చేసిన దానికి ఇదే సరైన నిర్ణయం అంటున్నారు. మరి ఈ తీవ్ర నిర్ణయం ఖచ్చితంగా అమలవుతుందా లేక ఇంకేవైనా మార్పులుంటాయా అనేది చూడాలి.

Related Posts