ఒకప్పుడు బాలీవుడ్ లో వరుసగా వందేసి కోట్లు వసూళ్లు సాధించిన చిత్రాలతో అరుదైన రికార్డులు కొల్లగొట్టాడు అక్షయ్ కుమార్. ఈ బాలీవుడ్ ఖిలాడి ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్ అయ్యి తీరేది. కానీ.. ఇప్పుడు అక్షయ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ సీనియర్ హీరోకి ఇప్పుడో బడా హిట్ కావాలి. అలాగే.. మరో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ‘వార్’ తర్వాత టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ లో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు.
ఈ యాక్షన్ స్టార్స్ ఇద్దరూ కలిసి ‘బడే మియా చోటే మియా’గా థియేటర్లలోకి వస్తున్నారు. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతుండడం విశేషం. మానుషీ చిల్లర్, ఆలయ, సోనాక్షి సిన్హా ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 11న ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది. పూజా ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో అంచనాలను పెంచిన ‘బడే మియా చోటే మియా’ ఈవారం థియేటర్లలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.