బెల్లంకొండకి అక్కడ భారీ డిమాండ్

తెలుగు స్టార్ హీరోల సినిమాలకు.. నార్త్‌ లో సూపర్ క్రేజుంది. మన కథానాయకుల హిందీ డబ్బింగ్ వెర్షన్స్‌కి.. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఈకోవలో ఇప్పటివరకూ తెలుగు నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ తో పాటు రామ్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా.. తెలుగులో పెద్దగా స్టార్ డమ్ లేకపోయినా.. హిందీ సర్కిల్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘జయజానకి నాయక, కవచం, సీత’ వంటి సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ యూట్యూబ్ ని షేక్ చేశాయి. తెలుగులో ఫ్లాపైన ‘కవచం’ సినిమా అయితే యూట్యూబ్ లోని అన్ని ప్లాట్ ఫామ్స్ లో కలిపి ఏకంగా 830 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది. పెన్ స్టూడియోస్ ప్లాట్ ఫామ్ లో ఉన్న ‘జయజానకి నాయక’కు 800 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇంకా.. తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ‘సీత’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ 650 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

మొన్నటివరకూ బెల్లంకొండ సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కు 15 నుంచి 20 కోట్లు వచ్చేవి. అందుకే.. పెన్ స్టూడియోస్ ప్రత్యేకంగా బెల్లంకొండతో హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ ను చేసింది. ఇక.. ఈ యంగ్ హీరో ఫోకస్ అంతా ఇప్పుడు ‘టైసన్ నాయుడు’ సినిమాపైనే ఉంది. ‘భీమ్లా నాయక్‘ ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ‘టైసన్ నాయుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts