భీమా’ సాంగ్.. గల్లీ సౌండుల్లో పోలీస్ పవర్

మ్యాచో స్టార్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘భీమా‘. కన్నడ స్టార్ డైరెక్టర్ ఎ.హర్ష ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా మార్చి 8న విడుదలకానుంది. ఇప్పటికే టీజర్, ఒక రొమాంటిక్ సాంగ్ తో అలరిస్తోన్న ‘భీమా‘ నుంచి లేటెస్ట్ గా ‘గల్లీ సౌండుల్లో.. నువ్వు బ్యాండు కొట్టు మామ’ అంటూ సాగే ఫక్తు మాస్ సాంగ్ రిలీజయ్యింది.

‘కె.జి.యఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతంలో రూపొందిన ఈ పాటను రవిబస్రూర్ తో కలిసి సంతోష్ వెంకీ రాశాడు. ఇక.. ఈ గీతాన్ని ఆలపించిందీ సంతోష్ వెంకీ. గోపీచంద్ పోలీస్ పవర్ చూపించే సన్నివేశాలతో ‘గల్లీ సౌండుల్లో’ గీతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో నాజర్, నరేష్, వెన్నెల కిషోర్, రఘుబాబు, పూర్ణ కనిపించనున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ‘భీమా‘ గోపీచంద్ కి ఎలాంటి విజయాన్నందిస్తుందో చూడాలి.

Related Posts