‘సరిపోదా శనివారం’ నుంచి యాక్షన్ గ్లిమ్స్ రెడీ

నేచురల్ స్టార్ నాని అంటే సహజమైన నటనకు కేరాఫ్ అడ్రస్. నాని ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. నటనకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటాడు. అయితే.. అప్ కమింగ్ మూవీ ‘సరిపోదా శనివారం’లో యాక్షన్ సీక్వెన్సెస్ కి ఎక్కువ ప్రాధాన్యాత ఇస్తున్నారట. హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన గత చిత్రం ‘అంటే.. సుందరానికి’తో పూర్తి స్థాయి వినోదాన్ని పంచింది. ఈసారి ‘సరిపోదా శనివారం’ సినిమాతో వినోదంతో పాటు.. యాక్షన్ ట్రీట్ కూడా అందించబోతున్నారట.

ఫిబ్రవరి 24న శనివారం నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ నుంచి స్పెషల్ యాక్షన్ గ్లిమ్స్ రాబోతుందట. ‘ఇడుముడి శృంఖల విచ్ఛేది.. సిడిముడి వీక్షణ ఉద్రేకి.. నఖముఖ జ్వాలా కీలాద్రి.. స్థిర శనివారం సమవర్తి..’ వంటి పవర్ ఫుల్ లిరిక్స్ తో అతన్ని చూడాలనుకుంటున్నారా అంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్. ఈ శనివారం ఉదయం 11 గంటల 59 నిమిషాలకు ‘సరిపోదా శనివారం’ నుంచి స్పెషల్ బర్త్ డే గ్లిమ్స్ విడుదలవుతోంది.

Related Posts