సర్ ప్రైజింగ్ దర్శకుడితో బాలకృష్ణ సినిమా

నందమూరి బాలకృష్ణ దూకుడుకు టాలీవుడ్ కూడా షాక్ అవుతోంది. సినిమాలు చేస్తూనే ఆహాలో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నాడు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న వీర సింహారెడ్డి ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉండబోతోంది. ఈ మూవీ మార్చిలో మొదలవుతుంది అనే టాక్ వచ్చింది. అయితే అనిల్ కంటే ముందే మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట బాలయ్య. అది కూడా అంతా ఊహించినట్టుగానే అల్లు అరవింద్ నిర్మాణంలో. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందే ఈ సినిమాలో బాలయ్య ఇప్పటి వరకూ చేయని జానర్ లో నటించబోతున్నాడు.బాలకృష్ణ సినిమా అంటే మాస్ టార్గెట్ గా ఉంటుంది.

బ్లడ్ షెడ్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటాడు. అలాంటి బాలయ్య చాలా గ్యాప్ తర్వాత ఫ్యామిలీ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. ఇందులో కొత్త జానర్ ఏముందీ అనుకుంటున్నారేమో.. ఫ్యామిలీ మూవీస్ అంటే ఒకప్పుడు బాలయ్య మాత్రమే సూట్ అయ్యాడు. తర్వాతే మాస్ ను మెప్పించాడాయన. అయితే ఇది ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. అంటే సైకలాజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాల్లో బాలయ్య ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఈ వార్త ఫ్యాన్స్ లోనూ ఓ కొత్త జోష్‌ ను ఇస్తోంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. అరవింద్ లాంటి ప్లానింగ్ ఉన్న నిర్మాతకు అదేమంత పెద్ద కష్టం కాదు. ఇంతకీ ఈ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా..?

కేరాఫ్‌ కంచరపాలెం చిత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన వెంకటేష్‌ మహా. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేశాడు. ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతోనూ ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పటి వరకూ అతను కమర్షియల్ డైరెక్టర్స్ జోన్ లోకి రాలేదు. బట్ బాలయ్యకు ఈ కథ చెప్పి ఒప్పించాడట. వినగానే బాలయ్యకు నచ్చేయడంతో వెంటనే ఎస్ చెప్పాడట. నిజానికి ఈ స్టోరీని ముందు విన్నది అరవిందే అంటున్నారు. ఆయనే ఈయన్ని హీరో వద్దకు పంపించాడట. సో.. కొత్త జానర్ లో ఉండటంతో పాటు తన ఇమేజ్ కు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా కనిపించిందట స్క్రిప్ట్. అందుకే ప్రాజెక్ట్ ఓకే అయింది.అన్నీ కుదిరితే సంక్రాంతి తర్వాత ఈ మూవీని స్టార్ట్ చేసి నెల లేదా మరో పది పదిహేను రోజులు అటూ ఇటూగా పూర్తి చేస్తారు. ఆ తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమాకు రెడీ అవుతాడు అంటున్నారు. ఏదేమైనా బాలయ్య దూకుడు బలే ఉంది కదా..

Related Posts