సర్ ప్రైజింగ్ దర్శకుడితో బాలకృష్ణ సినిమా

నందమూరి బాలకృష్ణ దూకుడుకు టాలీవుడ్ కూడా షాక్ అవుతోంది. సినిమాలు చేస్తూనే ఆహాలో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నాడు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న వీర సింహారెడ్డి ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉండబోతోంది. ఈ మూవీ మార్చిలో మొదలవుతుంది అనే టాక్ వచ్చింది. అయితే అనిల్ కంటే ముందే మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట బాలయ్య. అది కూడా అంతా ఊహించినట్టుగానే అల్లు అరవింద్ నిర్మాణంలో. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందే ఈ సినిమాలో బాలయ్య ఇప్పటి వరకూ చేయని జానర్ లో నటించబోతున్నాడు.బాలకృష్ణ సినిమా అంటే మాస్ టార్గెట్ గా ఉంటుంది.

బ్లడ్ షెడ్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటాడు. అలాంటి బాలయ్య చాలా గ్యాప్ తర్వాత ఫ్యామిలీ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. ఇందులో కొత్త జానర్ ఏముంద�