టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య సడెన్ గా షాక్ ఇచ్చాడు. త్వరలోనే మనోడు బ్యాచులర్ లైఫ్‌ కు మంగళం పాడేస్తున్నాడు. మామూలుగా ఇలాంటి వార్తలు ముందు రూమర్స్ గా అయినా వస్తాయి. బట్ శౌర్య సడెన్ గా పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పిన షాక్ ఇచ్చాడు. అంతకు ముందు రానా కూడా తన ప్రేమ వ్యవహారంలో ఇలాగే చేశాడు. శౌర్య ఏకంగా పది రోజుల్లో పెళ్లి అనగా అసలు విషయం చెప్పాడు. ఇంతకీ తను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా..?నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు అనూష శెట్టి.. (హీరోయిన్ అనుష్క శెట్టి కాదు.). తనది బెంగళూరు.

అక్కడే డిజైనర్ గా పనిచేస్తుంది. అక్కడే అనూష శెట్టి డిజైన్స్ అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కూడా తను. ఇండియాలోనే లీడింగ్ డిజైనింగ్ కంపెనీస్ లో వీళ్లదీ ఒకటి కావడం విశేషం. ఆర్కిటెక్చరల్ డిజైన్స్, ఇంటీరియర్ డిజైన్స్, ఇంటర్నేషనల్ సెలెక్సన్, లాండ్ స్కేప్ డిజైన్స్ లో టాప్ కంపెనీగా ఉంది. అంత పెద్ద కంపెనీకి అనూష శెట్టి మేనేజింగ్ డైరెక్టర్ అంటే చిన్న విషయం కాదు. అలాంటి పార్టనర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు శౌర్య.ఇక ఈ నెల 20నే వీరి పెళ్లి బెంగళూరులో గ్రాండ్ గా జరగబోతోంది. 19న మెహందీ ఫంక్షన్ ఉంటుందట. మరి ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఇన్విటేషన్స్ ఉంటాయా లేక తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ పెడతారా అనేది చూడాలి.