అగ్ర తారల ఆయుధ పూజ

నేడు ఆయుధ పూజ సందర్భంగా దసరా విషెస్ తో పాటు ఆయుధ పూజ శుభాకాంక్షలతో పలు క్రేజీ మూవీస్ నుంచి క్రేజ్ లుక్స్ రిలీజయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ’ చిత్రాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని తమిళ చిత్రం ‘తేరి’ రీమేక్ గా రూపొందిస్తున్నారనే ప్రచారం ఉంది.

ఆయుధ పూజ శుభాకాంక్షలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి రిలీజైన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో పోలీస్ డ్రెస్ లో భారీ సుత్తిని పట్టుకున్న పవన్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సుత్తిని చూస్తుంటే మార్వెల్ హీరోస్ లో థోర్ ఆయుధం గుర్తుకొస్తుంది. పవన్ మరో చిత్రం ‘ఓజీ’ నుంచి ఆయుధపూజ సందర్భంగా రిలీజ్ చేసిన పవన్ పోస్టర్ లో.. ఏవిధమైన ఆయుధాన్ని చూపించకపోయినా.. పవర్ స్టార్ చూపులే ఆయుధాలు అన్నట్టుగా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ అవేయింగ్ మూవీ ‘గుంటూరు కారం’ నుంచి అప్డేట్స్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అసలు దసరా కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందనే ప్రచారం జరిగింది. కానీ.. త్వరలోనే ఆ సింగిల్ రాబోతుందని ప్రకటిస్తూ.. మహేష్ బాబు పవర్ ఫుల్ లుక్ ఒకటి వదిలారు. ఈ పోస్టర్ లో కారు వెనుక కూర్చున్న మహేష్ బీడీ కాలుస్తూ.. విలన్ ను మడతెట్టేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలో కూడా ఓ పవర్ ఫుల్ ఆయుధాన్ని చూపించారు. ఈ పోస్టర్ లో పోలీస్ వాహనాన్ని చూస్తుంటే ఈ సినిమాలో మహేష్ బాబు పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి ఆయుధ పూజ సందర్భంగా ఓ స్పెషల్ ఆయుధాన్ని చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అసలు తెలుగులో ఆయుధాలను వాడడంలో ఓ సెపరేట్ క్రేజ్ సంపాదించుకున్న తారక్.. ఈ పోస్టర్ లో పట్టుకున్న ఆయుధం వైవిధ్యంగా ఆకట్టుకుంటుంది. వచ్చే యేడాది ఏప్రిల్ 5న ‘దేవర’ రాబోతున్నట్టు మరోసారి ఈ పోస్టర్ లో ప్రకటించారు.

‘సలార్’ విడుదల దగ్గర పడుతోన్న కొద్దీ ప్రచారంలో స్పీడు పెంచాల్సిన మేకర్స్.. ఇంకా కొత్త అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ను ఊరిస్తూ వస్తున్నారు. అసలు ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కూడా కావడంతో ‘సలార్’ నుంచి ట్రైలర్ లాంటిది వస్తుందని భావించారు అభిమానులు. అయితే ఆయుధపూజ శుభాకాంక్షలతో డజన్లకొద్దీ కత్తులతో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

Related Posts