టైటిల్స్ గా మారుతోన్న వారాల పేర్లు

అప్పుడప్పుడు కొన్ని సినిమాల విషయాల్లో కొన్ని సారూప్యతలు వస్తుంటాయి. కొన్ని సార్లు కథల విషయంలోనూ.. మరికొన్ని సార్లు తారాగణం విషయంలోనూ సిమిలారిటీస్ మనం గమనిస్తూనే ఉంటాం. అయితే.. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాల టైటిల్స్ వారాల పేర్లు ప్రధానంగా వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

‘ఆర్.ఎక్స్.100’ సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న అజయ్ భూపతి.. ‘మంగళవారం’ అనే టైటిల్ తో సినిమాని తెరకెక్కించాడు. అందాల భామ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. ఒక గ్రామంలో ప్రతీ మంగళవారం హత్యలు జరుగుతుంటాయి. అసలు ఆ హత్యలు మంగళవారమే జరగడానికి కారణం ఏంటి? అనేదే ఈ ‘మంగళవారం’ సినిమా కథాంశం. నవంబర్ 17న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది.

మంగళవారం అయ్యింది.. కట్ చేస్తే ఇప్పుడు శనివారం ప్రధానంగా మరో సినిమా వస్తోంది. అదే నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ప్రతీ మనిషికి ఓ రోజు వస్తుందనేది సామెత. అయితే.. ఈ సినిమాలో హీరోకి మాత్రం వారం వారం ఒకరోజు వస్తుంది. అదే శనివారం. అలా.. హీరోకి, శనివారానికి మధ్య ఉన్న బంధం ఏంటి? అనేదే ఈ సినిమా సబ్జెక్టుగా తెలుస్తోంది. రేపు ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకోబోతుంది.

Related Posts