విరూపాక్ష టీమ్ నుంచి మరో స్పెషల్ మూవీ

ఈ యేడాది సంచలన విజయం సాధించిన సినిమాలలో విరూపాక్ష ఒకటి. సాయితేజ్, సంయుక్త జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకుడు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు.శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.

హారర్ థ్రిల్లర్ గా వచ్చిన విరూపాక్ష ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.రెగ్యులర్ కమర్షిల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కథపైనే సాగిన కథనం ఈ మూవీకి మెయిన్ హైలెట్ గా నిలిచింది. సాయితేజ్, సంయుక్తల నటనకు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా ప్రాణాపాయ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత సాయితేజ్ చేసిన ఈ సినిమా అతనికీ ఓ గొప్పమైల్ స్టోన్ గా నిలిచింది. ఇక దర్శకుడు కార్తీక్ దండు ఓవర్ నైట్ హాట్ టాపిక్ అయ్యాడు.స్క్రీన్ ప్లే సుకుమార్ అందించినా.. తనదైన శైలిలో అడాప్ట్ చేసుకుని గొప్పగా ప్రెజెంట్ చేశాడు.


ఇక ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో చెప్పినా అలాంటిదేం లేదు. బట్ అదే టీమ్ నుంచి తాజాగా మరో సినిమా అనౌన్స్ అయింది. ఈ సారి మిథికల్ థ్రిల్లర్ అంటూ ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.మండుతున్న ఓ లోతైన లోయలోకి కొంతమంది రోప్స్ సాయంతో ఆ లోయలోనే కొండల మధ్య దిగుతున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. ఈ సారి కూడా సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నాడు. బ్యానర్ కూడా అదే. అయితే ఈ చిత్రంలో నటించే ఆర్టిస్టులు ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. జస్ట్ తమ కాంబినేషన్ నుంచి మరో థ్రిల్లర్ వస్తుందనే సమాచారం చెప్పారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో.

Related Posts