సర్కారు నౌకరీ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ

ఫస్ట్ లిరికల్ సాంగ్స్ వేస్తోన్న ఇంపాక్ట్ ఈ మధ్య బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న సినిమాలు ఈ ఫస్ట్ సాంగ్స్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేస్తూ మెప్పిస్తున్నాయి. ఆడియన్స్ అటెన్షన్స్ ను తమవైపు తిప్పుకుంటున్నాయి. అయితే ఇలాంటి పాటల్లో ఎక్కువగా మెలోడియస్ గా ఉంటేనే ఆడియన్స్ కు త్వరగా కనెక్ట్ అవుతున్నాయి. లేదంటే మంచి మాస్ బీట్ అయి ఉండాలి.

అలా లేటెస్ట్ గా ‘సర్కారు నౌకరి’ నుంచి నీళ్లాబాయి అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. సింగర్ సునిత్ తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఆ మధ్య వచ్చిన టీజర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. 1996లో కొల్లాపూర్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని చెప్పారు. టీజర్ తో ఆకట్టుకున్న తర్వాత ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాలకు ఎలాంటి పాటలు పడితే బావుంటుందో అచ్చం అలాగే ఉందీ సాంగ్.


డాక్టర్ పసునూరి రవీందర్ రాసిన ఈ గీతం వినగానే ఆకట్టుకునే మెలోడీ. ” నీళ్లాబాయి నిమ్మళంగా అడిగే ఈ సక్కని సుక్కా లగ్గమెప్పూడని.. ఎగిరే గువ్వా ఎన్నెలోలే నవ్వే.. ఆ పప్పూబువ్వ సందడెప్పుడనీ.. నేను బంతిపువ్వు.. నీది తుమ్మెద నవ్వు.. ” ఇలా మొదలైన ఈ గీతం పెళ్లికి సిద్ధమైన ఆడపడుచు ఊహలకు రూపంలా కనిపిస్తోంది.స్వచ్ఛమైన తెలంగాణ పదసాహితీ గీతానికి శాండిల్య పీసపాటి అందమైన ట్యూన్ ఇచ్చాడు. ఇక ఈ గీతాన్ని సోనీ కోమండూరి కూడా అంతే హాయిగా ఆలపించింది. మొత్తంగా సర్కారు నౌకరీ ఆకాశ్ కు మంచి డెబ్యూ అవుతుందనిపిస్తోంది. ఆకాశ్ సరసన భావన హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్ గంగనమోని డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు నిర్మిస్తుండటం విశేషం.

Related Posts