ధనుష్ తో రష్మిక మందన్నా

ప్యాన్ ఇండియన్ స్టార్ ధనుష్ కెరీర్ ఉన్నంత వైవిధ్యంగా మరే ఇండియన్ హీరో కెరీర్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అన్ని రకాల కథల్లోనూ ఇమిడిపోయే ప్రతిభ అతని సొంతం.క్లాస్ మాస్ ను మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు ధనుష్.

ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో రాబోతున్నాడు. డిసెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. తర్వాత తన కెరీర్ లో 50వ సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ మూవీ భారీ స్థాయిలో ఉంటుందని మాత్రం చెబుతున్నారు. అయితే ధనుష్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దాన్ని మరింత పెంచుకునేందుకు డైరెక్ట్ గా తెలుగు మూవీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆల్రెడీ సార్ అనే చిత్రంతో సత్తా చాటాడు కూడా.దీనికి ముందే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా అనౌన్స్ అయింది. కథ విషయంలో కాస్త ఆలస్యమైన ఈ మూవీ ధనుష్ 51వ సినిమాగా అనౌన్స్ అయింది.


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించబోయే ప్యాన్ ఇండియన్ తెలుగు సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను తీసుకున్నారు. ఈ మేరకు టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నాల్లో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది రష్మిక. నేషనల్ క్రష్ అనిపించుకున్న తర్వాత నుంచి అమ్మడి దూకుడు మరింత పెరిగింది.

తెలుగులో మంచి క్రేజ్ ఉంది. తమిళ్ లోనూ గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో బాగా తెలిసింది. వెరసి తనూ ప్యాన్ ఇండియన్ హీరోయిన్ అనిపించుకుంటోంది. అలాంటి బ్యూటీని ధనుష్ సరసన తీసుకోవడం అంటే ఈ మూవీకి కొంత వెయిట్ పెరిగినట్టుగానే భావించాలి.


సునిల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ నిర్మిస్తోన్న ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు.ఈ తరహా కథను డీల్ చేయడం శేఖర్ కు ఫస్ట్ టైమ్. మరి ఎలా హ్యాండిల్ చేస్తాడో కానీ ఈ కాంబినేషన్ మాత్రం వెరీ క్రేజీగా మారిందని చెప్పాలి.

Related Posts