‘కల్కి’.. అశ్వథ్థామ గా అమితాబ్ బచ్చన్

రెబెల్ స్టార్ ప్రభాస్.. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఎడి’. ఈ సినిమా టైటిల్ లోనే ఈ చిత్రం ఒక ఫ్యూచరిస్టిక్ మూవీగా అర్థమవుతోంది. అయితే.. ఈ సినిమాలో కేవలం ఫ్యూచర్ మాత్రమే కాదు.. మన పురాణాలతో లింక్ పెడుతూ పాస్ట్ ని కూడా చూపించబోతున్నాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాలో మహాభారతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడట. ‘కల్కి’ కథ మొత్తం ఆరువేల సంవత్సరాల స్పాన్ లో జరుగుతుందని ఆమధ్య వెల్లడించాడు నాగ్ అశ్విన్. క్రీస్తూ పూర్వం 3102లో జరిగినట్టుగా ప్రచారంలో ఉన్న ‘మహాభారతం’తో మొదలై.. క్రీ.శ. 2898 లో ‘కల్కి’ కథ అంతమవుతోందట.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో కనిపించబోతున్నట్టు రివీల్ చేసింది టీమ్. లేటెస్ట్ గా అమితాబ్ బచ్చన్ నటిస్తున్న పాత్రకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వథ్థామ పాత్రలో కనిపించబోతున్నాడు. మహాభారతం ప్రకారం అశ్వథ్థామ మరణం లేని చిరంజీవి. ఇక.. ‘కల్కి’ సినిమా కథంతా అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న అశ్వథ్థామ పాత్ర చుట్టూనే సాగబోతున్నట్టు తెలుస్తోంది.

‘కల్కి’ చిత్రం మే 9న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అయితే.. అప్పుడు ఎలక్షన్ల హడావుడి ఓ రేంజులో ఉంటుంది కాబట్టి ఈ తేదీని మారుస్తారనే ప్రచారం ఉంది. కానీ.. ఇప్పటివరకూ చిత్ర నిర్మాణ సంస్థ ‘కల్కి’ కొత్త తేదీపై ఎలాంటి అప్డేట్ అందించలేదు.

Related Posts