‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీ డేట్ ఫిక్స్..!

మలయాళం చిత్ర పరిశ్రమలో సరికొత్త కలెక్షన్ల బెంచ్ మార్క్ సెట్ చేసిన మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’. ఏ చిత్ర పరిశ్రమలోనైనా అగ్ర కథానాయకుల సినిమాలు సాధించే వసూళ్లు అత్యధికంగా ఉంటాయి. కానీ.. ఈ సినిమాలో ఎలాంటి స్టార్ డమ్ ఉన్న కాస్టింగ్ లేకపోయినా.. కథే హీరోగా రూపొంది అఖండ విజయాన్ని సాధించింది.

కొడైకెనాల్ బ్యాక్ డ్రాప్ లో చిదంబరం దర్శకత్వంలో షౌబిన్ షాహిర్ నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాడు. తెలుగులో కూడా అనువాద రూపంలో విడుదలైన ‘మంజుమ్మల్ బాయ్స్’కి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. మే 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ‘మంజుమ్మల్ బాయ్స్’ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.

Related Posts