అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌.. బిగ్ అప్డేట్

తెలుగులో క్రేజీ కాంబినేషన్ అంటే ఇప్పుడున్న టైమ్ లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి. అఫ్‌ కోర్స్ ఇదే అర్జున్ తో సుకుమార్ కాంబో కూడా క్రేజీ అనే చెప్పాలి. కాకపోతే త్రివిక్రమ్ తో అంటే ఇంకాస్త ఎక్కువ క్రేజ్ అంతే. వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. దేనికదే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాలు.

ముఖ్యంగా అల వైకుంఠపురములో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే అల్లు అర్జున్ కు పుష్పతో ప్యాన్ ఇండియన్ మార్కెట్ క్రియేట్ చేశాడు సుకుమార్. ఆ మార్కెట్ ను మరో లెవల్ కు తీసుకువెళ్లే ప్లానింగ్‌స్ స్టార్ట్ అయ్యాయి. అది త్రివిక్రమ్ డైరెక్షన్లో. కొన్నాళ్లుగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్.. మహేష్‌ బాబుతో గుంటూరు కారం చేస్తున్నాడు.

ఇలా ఓ పెద్ద ప్రాజెక్ట్ సెట్స్ లో ఉండగా మరో పెద్ద ప్రాజెక్ట్ ఎలా అనౌన్స్ చేస్తారు అంటూ ఆ మధ్య కొన్ని విమర్శలువచ్చాయి. బట్ వాటిని త్రివిక్రమ్ పట్టించుకుంటున్నట్టు లేడు. అందుకే ఈ కాంబోకు సంబంధించిన మూవీ అనౌన్స్ మెంట్ ఏకంగా ఓ ‘ వీడియో’ రూపంలో రాబోతోంది.


ఇక ఈ మూవీ ఇప్పటి వరకూ చూడని రేంజ్ లో ఉంటుందట. దేశవ్యాప్తంగా వచ్చే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా ఈ చిత్రం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాక ఈ ఒక్క ప్రాజెక్ట్ పైనే త్రివిక్రమ్ ఒక యేడాది కాలంగా వర్క్ చేస్తున్నాడట. అంటే ఈ కథ స్పాన్ ఏ రేంజ్ లో ఉండబోతోందో ఊహించుకోవచ్చు.

ఈ కథ స్పాన్ మాత్రం మామూలుగా ఉండదు అంటున్నారు. త్రివిక్రమ్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక లెక్క. ఇది ఓ లెక్క అనేలా పక్కా స్క్రిప్ట్ తోవస్తున్నాడట. అదే టైమ్ లో ఇద్దరి ఇమేజ్ లకు ఏ మాత్రం తగ్గకుండా కూడా ఉంటుందట. మొత్తంగా ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతోన్న నాలుగో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది.

Related Posts