స్పై ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదే

నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ స్పై. గత గురువారం విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇవాళా రేపు హిట్ టాక్ వచ్చినా.. ఫ్లాప్ టాక్ వచ్చినా ఆ ప్రభావం ఈవెనింగ్ షోకే తెలిసిపోతోంది. హిట్ అంటే సాయంత్రం బుకింగ్స్ పెరుగుతాయి. ఫ్లాప్ అంటే ఆల్రెడీ బుక్ చేసిన వాళ్లు కూడా వాపస్ తీసుకుంటున్నారు. అలా ఈ స్పై పైనా ఆ ప్రభావం పడింది.

విడుదలకు ముందు అంచనాలు పెంచడంలో ఈ మూవీ టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. పైగాప్యాన్ ఇండియన్ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశారు. సుభాస్ చంద్రబోస్ మిస్సింగ్ కేస్ గురించి చెప్పబోతున్నాం అని ఊరించారు. తీరా చూస్తే ఇదో సాధారణ సినిమా. టైటిల్ కు తగ్గ స్పైస్ సినిమాలో అస్సలు లేదు. పేరుకు స్పై అన్నా.. రెగ్యులర్ పోలీస్ ల్లానే ఉంటారు. ఏదో పెద్ద గన్స్ చేతిలో ఉన్నంత మాత్రాన రేంజ్ మారదు కదా..? బలమైన కంటెంట్ లేకుండా కొత్త దేశభక్తి పేరుతో సినిమాలు రుద్దితే కష్టం అని ఈ చిత్రం మరోసారి ప్రూవ్ చేసింది.


ఇక ఈ మూవీకి వచ్చిన టాక్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. కానీ వీళ్లు మాత్రం రోజూ ఓ కొత్త పోస్టర్ వేసి మా చిత్రం ఇంత గ్రాస్ కలెక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసిందీ అంటున్నారు. కానీ థియేటర్స్ లో జనాన్ని ఆ లెక్కలకు ఎక్కడా మ్యాచ్ కావడం లేదు. కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన నిఖిల్ కు వెంటనే షాక్ ఇచ్చింది స్పై.


ఆశ్చర్యంగా నిఖిల్ సరసన మరో స్పై గా నటించిన స్పైసీ బ్యూటీ ఐశ్వర్య మీనన్ కు వెంటనే పవన్ కళ్యాణ్‌ ఓజి చిత్రంలో ఛాన్స్ వచ్చింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. కాకపోతే స్పై గా తన ఎక్స్ ప్రెషన్స్ కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఈ సినిమా హిట్ అయి ఉంటే నిఖిల్ రేంజ్ ప్యాన్ ఇండియన్ స్థాయిలో పెరిగేదే. బట్ అతని ఆశలు నెరవేరలేదు. మొత్తంగా స్పైతో భారీ పరాజయాన్నే చూశాడు నిఖిల్.

Related Posts