Adipurush: ప్రభాస్ పైనే ఆశలన్నీ..

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2023 సమ్మర్ సినిమా పరిశ్రమకు గట్టి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ లో వచ్చిన విరూపాక్ష ఒక్కటే హిట్ అనిపించుకుంది.

అంతకు ముందు మార్చి ఆఖర్లో వచ్చిన దసరా విజయం సాధించింది. మధ్యలో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి. దీనికి తోడు స్టార్ హీరోల సినిమాలు కూడా లేకపోవడం పెద్ద లోటుగా చెప్పాలి. ఈ లోటును భర్తీ చేసే అవకాశం వచ్చినా.. ఒక్క చిన్న సినిమా కూడా సూపర్బ్ అనిపించుకోలేకపోయింది. ఇంకా చెబితే బిచ్చగాడు2, 2018 వంటి డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

ఇక మే నెలలో ఒక్క సినిమా కూడా హిట్ అనిపించుకోలేకపోయింది. ముఖ్యంగా ఆరంభంలోనే వచ్చిన గోపీచంద్ రామబాణంపై చాలా అంచనాలున్నాయి. బట్ వాటిని మినిమంగా కూడా అందుకోలేకపోయిందీ చిత్రం.

అదే రోజు వచ్చిన అల్లరి నరేష్ ఉగ్రం సైతం రిలీజ్ కు ముందు ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది. బట్.. నో యూజ్. హింస ఎక్కువ.. లాజిక్ తక్కువగా ఉండటంతో నాంది వంటి క్రేజీ కాంబోలో వచ్చిన ఈ మూవీ మెప్పించలేకపోయింది. ఇక అందరికంటే ఎక్కువ అంచనాలు నాగ చైతన్య కస్టడీపై ఉన్నాయి. వెంకట్ ప్రభు డైరెక్షన్, ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అంటూ హడావిడీ చేసిన కస్టడీ కూడా పోయింది.ఈ వేసవికి చల్లదనం తెస్తాం అన్న అన్నీ మంచి శకునములే మూవీ కూడా చల్లబడిపోయింది.ఇక జూన్ ఆరంభమే పెద్ద షాక్ ఇచ్చింది. నేను స్టూడెంట్ సర్, అహింస, పరేషాన్ చిత్రాల్లో ఏదీ మెప్పించలేదు.

ఇక సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. అయినా ఈ జూన్ 16న వచ్చే ప్రభాస్ ఆదిపురుష్ పైనే టాలీవుడ్ ఆశలన్నీ పెట్టుకుంది.ఈ మూవీతో బ్లాక్ బస్టర్ పడితే తెలుగు సినిమా పరిశ్రమకు కాస్త ఊరట దక్కుతుంది.

కొన్నాళ్ల క్రితం ఆదిపురుష్ పైనా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ తో పాటు రీసెంట్ గా వచ్చిన పాట చూసిన తర్వాత ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఇక ఈ నెల 6 న తిరుపతితో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో గ్రాండ్ గా ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈ ప్రమోషన్స్ తో అంచనాలు భారీగాపెంచి వాటిని అందుకుంటే తెలుగులోనే కాక దేశవ్యాప్తంగా ఓ బాక్సాఫీస్ కు ఓ ఊపు వస్తుందని చెప్పొచ్చు. మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాస్.. అంచనాలను అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Related Posts