ఛీ ఛీ.. ఈవిడేం తల్లి

అమ్మంటే బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఏ చిన్న కష్టం వచ్చినా ప్రాణం అడ్డుపెట్టైనా కాపాడుకుంటుంది. కానీ కొంతమంది ఉంటారు. వాళ్లు మాతృత్వానికే మచ్చ తెస్తారు. అలాంటి ఉదంతమే ఇది. విజయనగరంలో ఓ తల్లి చేసిన తప్పుడు పనికి కూతురు ప్రాణం మీదికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు చెందిన ఓ మహిళ పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది. ఓ కూతురు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో మరో పెళ్లి చేసుకుంది.

అతనికి ఇద్దరు పిల్లలు. కానీ ఈమె ప్రవర్తన సరిగా లేదని తన ఇద్దరు పిల్లలను తీసుకుని అతను వెళ్లిపోయాడు. ఈవిడ మరో వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. కూతురును ఓ హాస్టల్ లో ఉంచి చదివిస్తోంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న ఆ పాప సెలవులకు ఇంటికి వచ్చింది. అయితే వారి ఇంటికి తరచూ కొత్త వ్యక్తులు వస్తుండటం చూసి తల్లిని నిలదీసింది. ఇదే సమయంలో ఓ వ్యక్తి నీ కూతురులో హీరోయిన్ లక్షణాలున్నాయి.. కానీ శారీరకంగా ఇంకా ఎదగాలి. అందుకోసం కొన్ని స్టెరాయిడ్స్ వాడాలి అని చెప్పింది.


ఆ వ్యక్తి మాటలు నమ్మి తన కూతురుకి బలవంతంగా కృత్రిమ మందులు, ఇంజెక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది తల్లి. దీంతో ఆ పాప శారీరకంగా బలహీన పడింది. బాధను భరించలేకపోయింది. దీంతో ఓ రోజు 1098 చైల్డ్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసింది.

వాళ్లు ఆమె చెప్పింది విని చలించిపోయి అధికారులకు, పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. పోలీస్ లు వచ్చి పాపను చైల్డ్ లైన్ వారి సాయంతో విశాఖపట్నంలోని స్వధార్ హోమ్ కు ఆ బాలికను పంపించారు. ఈ ఘటనపై బాలిక తల్లితో పాటు ఆమెకు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపైనా పోలీస్ లు కేస్ నమోదు చేశారు. ఈ ఘటన చూసిన తర్వాత చాలామంది ఛీ ఛీ ఈవిడేం తల్లి అంటూ ఈసడించుకుంటున్నారు.

Related Posts