HomeMoviesటాలీవుడ్నాగ చైతన్య దూకుడు

నాగ చైతన్య దూకుడు

-

అక్కినేని నాగ చైతన్య వరుసగా రెండు ఫ్లాపులు వచ్చిన తర్వాత అలెర్ట్ అయ్యాడు. కథల ఎంపికలో ఇంతకు ముందులా కాక కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్లో ఓ సినిమాకు కమిట్ అయి ఉన్నాడు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందబోతోన్న ఈ చిత్రం కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందబోతోంది. ఈ సినిమా కోసం ఇప్పటి వరకూ ఏ హీరో చేయని విధంగా ఒరిజినల్ లొకేషన్స్ కు వెళ్లి రెక్కీ నిర్వహించి ఆ పాత్ర తాలూకూ వ్యక్తులతో సమావేశం అయ్యాడు. అంతేకాదు..ఈ కథ సముద్రంలో సాగుతుంది కాబట్టి.. ఒక ఫిషరీస్ బోట్ లో సముద్రంలో కొంత దూరం ప్రయాణం కూడా చేశాడు. కీర్తి సురేష్‌ ను హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఇక ఈ మూవీతో పాటు ఒకేసారి మరో సినిమాను కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతా ఊహించినట్టుగానే శివ నిర్వాణ డైరెక్షన్ లోనే ఈ సినిమా ఉండబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. శివ ఈ బ్యానర్ లో చేసిన ఖుషీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఇప్పటికే చైతన్యతో చేసే సినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ అంతా రెడీగా ఉందని టాక్. కాకపోతే ఫైనల్ వెర్షన్ ఓసారి చెక్ చేసుకుంటే ఆ వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందంటున్నారు.

ఇక చైతన్య.. సమంత కలిసి ఉన్నప్పుడు శివ నిర్వాణ వీరితో చేసిన మజిలీ మెమరబుల్ హిట్ గా నిలిచింది. ఆ పాత్ర చైతన్య కెరీర్ లో కొత్తదనం ఉన్న పాత్రగా గుర్తింపు తెచ్చుకుంది. చైతన్య, సమంత విడిపోయిన తర్వాత మళ్లీ వారితో విడి విడిగా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకున్న ఈ దర్శకుడు ఏదో మ్యాజిక్ చేస్తున్నాడా అనిపిస్తోంది కదూ..

ఇవీ చదవండి

English News