రేర్ కాంబో.. క్లాస్ డైరెక్టర్ తో మాస్ మ్యూజిక్ డైరెక్టర్

టాలీవుడ్ లో ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. హృద్యమైన కథలను అంతే హృద్యంగా వెండితెరపై ఆవిష్కరిస్తుంటాడు. ఇతని సినిమాలలో మాస్, యాక్షన్ అనే పదాలకు పెద్దగా చోటు ఉండదు. అందుకే.. శేఖర్ కమ్ములను అందరూ క్లాస్ డైరెక్టర్ గా పిలుస్తంటారు. కానీ.. ఈసారి శేఖర్ రూటు మార్చబోతున్నాడట. ధనుష్ తో చేయబోయే సినిమాకోసం తన క్లాస్ ను కాసేపు పక్కనపెట్టి.. మాస్ అవతార్ లోకి మారబోతున్నాడట.

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందే బహు భాషా చిత్రం ఇప్పటికే ఓపెనింగ్ జరుపుకుంది. ఈ మూవీలో ధనుష్ తో పాటు కింగ్ నాగార్జున కూడా నటిస్తాడనే ప్రచారం ఉంది. అయితే.. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక.. ఈ మూవీకోసం తన రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను కాకుండా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ను రంగంలోకి దింపబోతున్నాడట. ధనుష్ మాస్ ఇమేజ్ కు దీటుగా రూపొందే ఈ మూవీలో మ్యూజిక్ కి మంచి ప్రాధాన్యత ఉండబోతుందట. దానికి దేవిశ్రీ అయితేనే న్యాయం చేస్తాడని భావించాడట శేఖర్ కమ్ముల. త్వరలోనే శేఖర్-ధనుష్ కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.

Related Posts