‘సలార్ 2‘ రిలీజ్ అయ్యేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

రెబెల్ స్టార్ ప్రభాస్ ను ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చింది ‘సలార్‘. ఈ మూవీలో ప్రభాస్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. విడుదలై రెండు వారాలు పూర్తవుతోన్నా.. ‘సలార్ 1‘ ఇంకా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూనే ఉంది. ఇక.. ‘సలార్ 1‘ కేవలం ట్రైలర్ మాత్రమే అని.. అసలు కథంతా ‘సలార్ 2‘లోనే ఉందని లేటెస్ట్ గా ఈ మూవీ ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ కన్ఫమ్ చెసారు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్యూలో ‘సలార్ 2‘ గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు హోంబలే ఫిల్మ్స్ అధినేత.

‘సలార్ 2‘కి మొత్తం స్క్రిప్ట్ సిద్ధమైందని.. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించే అవకాశాలున్నాయని అతను అన్నారు. 15 నెలల్లో పార్ట్ 2ని పూర్తిచేయాలని ప్రణాళిక వేసుకున్నామని.. 2025 ద్వితియార్థంలో ‘సలార్ 2‘ విడుదలయ్యే అవకాశాలున్నాయని విజయ్ తెలిపారు. ఇక.. సెకండ్ పార్ట్ లో యాక్షన్, డ్రామా, పాలిటిక్స్ అన్నింటినీ మేళవించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ట్రీట్ అందించబోతున్నాడనే కాన్ఫిడెన్స్ వెల్లిబుచ్చారు విజయ్ కిరంగదూర్.

Related Posts