క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్న అనుష్క

సినిమా సినిమాకీ మధ్య అస్సలు గ్యాప్ తీసుకోవడం అంటే విలక్షణ దర్శకుడు క్రిష్ కి ఇష్టం ఉండదు. కానీ.. పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు‘ విషయంలో అతని ప్రమేయం లేకుండానే గ్యాప్ వచ్చేసింది. పవర్ స్టార్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడంతో ఈ పీరియడ్ మూవీ ఆలస్యమవుతూ వస్తోంది. ఆమధ్య ‘హరి హర వీరమల్లు‘ గ్యాప్ లో ‘కొండపొలం‘ పూర్తిచేశాడు క్రిష్. ఇటీవల ‘కన్యాశుల్కం‘ పేరుతో ఓ వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కించాడట. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ విలక్షణ దర్శకుడు ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఆ కథను అనుష్క తో తెరకెక్కించాలనేది అతని ప్లాన్. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘వేదం‘ సినిమాకి మంచి పేరొచ్చింది. ఈ మూవీలో సరోజ పాత్రలో వేశ్యగా అదరగొట్టింది అనుష్క. ఇప్పుడు మళ్లీ అలాంటి ఇంపాక్ట్ కలిగించే మరో పాత్రలో అనుష్కను ఆవిష్కరించనున్నాడట. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ లో నటించడానికి స్వీటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

Related Posts