2023 బేబీ, ఖుషీలదే హవా

ఏ సినిమాకైనా టెక్నికల్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే కథలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నా కవర్ అవుతాయి. ముఖ్యంగా సంగీతం. మ్యూజిక్ బావుంటే సినిమా సగం విజయం సాధించినట్టే అనే సామెత దశాబ్దాలుగా ఉంది. ఒకప్పుడు పాటలే ఓపెనింగ్స్ తెచ్చేవి. ఈ మధ్య మళ్లీ ఆ ట్రెండ్ మొదలైంది. పాటలు బావుంటే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా చూడాలినే అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అయితే ఒక సినిమాలో అన్ని పాటలూ బావుంటాయి అని చెప్పలేం. బావుంటే అదే బెస్ట్ ఆల్బమ్ అవుతుంది.

అలా చూస్తే ఈ యేడాది ది బెస్ట్ ఆల్బమ్ గా ‘బేబీ’ సినిమానే చెప్పాలి. ఇందులోని పాటలన్నీ కథానుసారం సాగేవే. అనవసరమైన డ్యూయొట్స్ లేవు. ఐటమ్ సాంగ్ అవసరమే లేదు. అలాగే పాటలన్నీ మెలోడియస్ గానూ ఉన్నాయి. సినిమా ఎమోషన్ ను ఎలివేట్ చేస్తూనే ఎమోషన్ ను పండించడం అంత సులువేం కాదు. బట్‌ విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన బేబీ చిత్రంలోని పాటలన్నీ హిట్టే. ఇప్పటి వరకూ 2023లో ఇదే బెస్ట్ ఆల్బమ్ అనుకుంటున్నారు చాలామంది.

బట్ అంతకు మించిన ఆల్బమ్‌ లా కనిపిస్తోంది ఖుషీ.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న ఖుషీ చిత్రానికి ఇప్పటి వరకూ వచ్చిన రెండు పాటలూ తిరుగులేని అంచనాలు పెంచాయి. ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన నా రోజా నువ్వే అనే పాట 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఆరాధ్య అనే పాట సైతం అదరగొడుతోంది. ఇదీ ఇప్పటి వరకూ 20 మిలియన్ వ్యూస్ వరకూ సంపాదించింది. లేటెస్ట్ గా టైటిల్ సాంగ్ వచ్చింది. ఈ పాటా ఆకట్టుకునేలానే ఉండటం విశేషం. చూస్తోంటే ఇదో మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. అలాగే ఈ యేడాదికి ది బెస్ట్ ఆల్బమ్ అవుతుంది అనిపించేస్తుంది.

మరో విశేషం ఏంటంటే ఈ మూడు పాటలనూ రాసింది దర్శకుడు శివ నిర్వాణే. ఇక హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం చేస్తున్నాడు. ఇతను మళయాలంలో మోస్ట్ ఫేమస్. కానీ బై బర్త్ మాత్రం దుబాయ్ కి చెందిన వాడు కావడం విశేషం. మొత్తంగా ఈ యేడాది అన్నదమ్ముల సినిమాల పాటలు ది బెస్ట్ ఆల్బమ్స్ గా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక ఈ పాటలు ఖుషీ మూవీకి గ్రాండ్ ఓపెనింగ్స్ తెస్తాయి అనడంలో ఏ డౌట్ లేదు.
ఇక మిగతా సినిమాల్లోని కొన్ని పాటలు బావున్నాయి. కానీ అన్నీ కాదు. ఈ రెండు సినిమాలు అలా కాదు. బేబీలోని అన్ని పాటలూ.. ఖుషీలో ఇప్పటి వరకూ వచ్చిన మూడు పాటలూ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. విజువల్స్ పరంగానూ ఈ పాటలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ 2023లో ది బెస్ట్ ఆల్బమ్స్ లో ఈ రెండు సినిమాలదే హవా అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Related Posts