పవన్ కళ్యాణ్, సాయితేజ్ నటించిన బ్రో సినిమాకు ముందు నుంచీ పద్దగా అంచనాలు లేవు. దీనికి తోడు టికెట్ రేట్లు పెంచలేదు. ఎక్స్ ట్రా షోస్ వేయలేదు. అయినా ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది అనే చెప్పాలి. డే వన్ ఈ చిత్రానికి 30 కోట్ల వరకూ షేర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్టామినాకు ఈ ఫిగర్స్ మరోసారి నిదర్శనంగా నిలిచాయి అని చెప్పొచ్చు.
ఇప్పుడున్న సిట్యుయేషన్స్ లో అంచనాలు, హైక్స్ లేకుండా ఈ కలెక్షన్స్ సాధించడం అనేది చిన్న విషయం కాదు. అటు ఆంధ్రలో కూడా మంచి కలెక్షన్స్ రావడంతో ఈ ఫిగర్ సాధ్యం అయింది. అయితే వీరి టార్గెట్ కు ఇది సరిపోదు అనే చెప్పాలి. యస్.. బ్రో మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ బావున్నాయి. కానీ టాక్ మిక్స్ డ్ గా ఉంది. అందువల్ల మొదటి రోజు ఊపు తర్వాతి రోజుల్లో కనిపించడం కష్టం. అలా చూస్తే ఈ మూవీకి ఉన్న థియేట్రికల్ టార్గెట్ 100 కోట్లు.
ఈ టాక్ తో ఆ కలెక్షన్స్ సాధించడం దాదాపు అసాధ్యం అనే చెబుతున్నారు విశ్లేషకులు. ఈ రెండు రోజుల్లో మరో 30 -35 కోట్లు వస్తాయి అనే అంచనాలున్నాయి. అంటే వీకెండ్ వరకూ ఓ 70 కోట్లు అనుకున్నా ఆ తర్వాత మరో 30కోట్లు సాధించడం చాలా కష్టమే. ఆ మాటకొస్తే.. ఈ వారం పెద్దగా సినిమాలు లేకపోయినా పవన్ కళ్యాణ్ సినిమాకు భారీ క్రేజ్ అయితే లేదు. అందువల్ల ఈ వీకెండ్ కు 70 కోట్లు అనేది కూడా డౌటే.
అయితే ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ సినిమా కావడం వల్ల వచ్చిన తంటాలే. లేదంటే ఓ సాధారణ నటుడు చేయాల్సిన పాత్రలో ఆయన కనిపించడం వల్లే సినిమాకు వెయిట్, బడ్జెట్ పెరిగాయి. కానీ బ్రో లో అంత మేటర్ లేకపోవడంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే మామా అల్లుళ్లు మొదటి రోజు అదరగొట్టారు. కానీ టార్గెట్ ను ఛేదించడం మాత్రం చాలా పెద్ద టాస్కే. ఆ టాస్క్ ను కూడా ఛేదిస్తారా లేదా అనేది చూడాలి.