మెగాస్టార్ కు మెగా కటౌట్

మెగాస్టార్ మెగా ఫీస్ట్ కు టైమ్ దగ్గర పడుతోంది. ఆయన నటించిన భోళా శంకర్ ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది. ఇప్పటి నుంచే ఆ సంబరాలు మొదలుపెట్టారు మేకర్స్. అటు అభిమానులు కూడా ఈ చిత్రం ట్రైలర్ తర్వాత ఈగర్ గా చూస్తున్నారు. ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా గేమ్ ఛేంజ్ అయింది.

అప్పటి వరకూ ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ కూడా కాస్త లైట్ తీసుకున్నారు అనేది నిజం. బట్ మరోసారి వింటేజ్ మెగాస్టార్ ను చూపించేలా ఈ ట్రైలర్ ఉంది. దీనికి తోడు రీమేక్ అయినా తెలుగు కోసం చాలా మార్పులు చేర్పులు చేశారు. అవన్నీ ఆడియన్స్ కు కొత్త ఫీల్ఇవ్వడం ఖాయం అని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇక మెగాస్టార్ అనే ట్యాగ్ వచ్చిన దగ్గర నుంచి టాలీవుడ్ లో తనకు తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు చిరంజీవి.


ఆ మెగాస్టార్డమ్ ను మరోసారి ఎలివేట్ చేసేలా ఇప్పటి వరకూ టాలీవుడ్ లోనే లేనంత బిగ్గెస్ట్ కటౌట్ ఆయనకోసం కట్టారు. ఆ కటౌట్ హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే మధ్యలోని సూర్యపేట దగ్గర ఉన్న రాజుగారి తోట అనే హోటెల్ వద్ద ఏర్పాటు చేశారు. దీంట్లో భోళా శంకర్ లోని మెగాస్టార్ కటౌట్ కనిపిస్తుండటంతో ఆ రూట్లో ప్రయాణం చేసేవారికి నిత్యం ఓ గొప్ప ఫీల్ ఇస్తుందని చెప్పొచ్చు. మరి ఈ కటౌట్ ఎన్ని అడుగులతో నిర్మించారు అనేది చెప్పలేదు కానీ.. ఇప్పటి వరకూ ఇదే టాలీవుడ్ లో అతి పెద్ద కటౌట్ అని మాత్రం చెబుతున్నారు. మరి ఈ కటౌట్ ను క్రాస్ చేసే కటౌట్ నెక్ట్స్ ఇంకెవరు పెడతారో ఊహించగలరా..?

Related Posts