భోళా శంకర్.. ఈ తప్పు ఎవరిది..

ఒక సినిమా రిజల్ట్ మాగ్జిమం టీజర్ తో అర్థం అవుతుంది. ట్రైలర్ తేల్చేస్తుంది. భోళా శంకర్ కు రెండోదే కరెక్ట్. నిజంగా ఈ సినిమా ప్రారంభంలోనే అంతా ఊహించారు. ఈ రిజల్టే వస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారు. బట్ అక్కడ ఉన్నది మెగాస్టార్ చిరంజీవి. పైగా దర్శకుడు మెహర్ రమేష్‌ చాలా స్ట్రాంగ్ గా చాలా మార్పులు చేశాం అని.. అన్నయ్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందని చెబుతూ వస్తున్నాడు. అయినా ఏదో మూల ఓ డౌట్ ఉండేది.

ఫైనల్ గా అది తీరిపోయింది. ఊహించినట్టుగానే ఈ చిత్రం అభిమానులను కూడా మెప్పించలేకపోయింది. మరి సాధారణ ప్రేక్షకులే ఊహించిన అంశాన్ని మెగాస్టార్ ఎందుకు పసిగట్టలేకపోయాడు. ఇన్ని సినిమాలు, ఇన్నేళ్ల అనుభవం ఏం చెబుతోంది.. అంటే ఇప్పటికీ తనను యంగ్ స్టర్ గానే ప్రేక్షకులు చూస్తారు అనుకుంటున్నాడా లేక చూడాల్సిందే అని చెప్పాలనుకుంటున్నాడా అనేది మాత్రం ఇంకా కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఆల్రెడీ వాల్తేరు వీరయ్యను హిట్ చేశారు. అప్పుడూ ఇవే ఫైట్లు, ఇవే పాటలు. కాకపోతే మాస్ మహరాజ్ సపోర్ట్, కొంత వరకూ ఆకట్టుకునే కథ.

అంతకు ముందు వచ్చిన గాడ్ ఫాదర్, ఆచార్యలు ఆయన ఇమేజ్ కు భిన్నమైన సినిమాలు. ఇవన్నీ కలిసొచ్చే వాల్తేర్ వీరయ్యకు విజయం అందించాయి. బట్ ఇక్కడ అలాంటివి ఉన్నాయా అంటే అస్సలు లేవు కదా..? ఈ మాత్రం మెగాస్టార్ కు తెలియదా..? అంటే తెలుసు. అయినా ఎందుకు చేశాడు అంటే తన ఫ్యాన్స్ చూస్తే చాలు అనుకున్నాడేమో. లేకపోతే దర్శకుడి నుంచి ఆర్టిస్టుల వరకూ పదే పదే ఫ్యాన్స్ కోసమే అని ఎందుకు చెబుతూ వచ్చారు..? తీరా ఇప్పుడు ఫ్యాన్స్ కూ నచ్చలేదు. అంటే ఆ తప్పు ఎవరు మోయాలి..


నిజానికి భోళా శంకర్ సినిమా విషయంలో అందరూ మెహర్ రమేష్‌ ను తప్పు పడుతున్నారు కానీ.. అసలు తప్పు చిరంజీవిదే. ఈ కథను ఎంచుకోవడమే మొదటి మిస్టేక్. తమిళ్ లో హిట్ కాబట్టి ఇక్కడా హిట్ అవుతుందని ఏం లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ చేసిన అన్నవరం సినిమా తమిళ్ లో సిస్టర్ సెంటిమెంట్ తోనే ఉంది. అక్కడ బ్లాక్ బస్టర్. ఇక్కడ డిజాస్టర్. ఈ తేడా ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా.. ఇక చిరంజీవి విషయంలో ఈ తప్పు డబుల్ కావడానికి కారణం ఆ వేదాళం తెలుగులోనూ డబ్ కావడం. పైగా ఒరిజనలే రొటీన్ సినిమా. అక్కడి హీరో ఇమేజ్ తో లాగించేశారు.

బట్ అదే కథ ఇక్కడ చేస్తున్నప్పుడు హీరో ఇమేజ్ తో వర్కవుట్ కాదు. ఎందుకంటే వాల్తేర్ వీరయ్యలా వీక్ గా ఉన్నా స్ట్రెయిట్ స్టోరీ అయితే ఇమేజ్ తో లాగించొచ్చు. కానీ ఒక హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా మరో హీరో ఇమేజ్ తో హిట్ కొట్టడం అసాధ్యమే. వీళ్లు ఎంత మార్పులు చేర్పులు చేసినా అవేవీ అసలు కథను నిలబెట్టలేవు. ఇప్పుడు భోళా శంకర్ కు జరిగింది ఇదే.


ఇంత త్వరగా ఓ సినిమా పోయిందని చెప్పాలా అనిపించొచ్చు. ఇంత త్వరగా ఏం కాదు.. హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ప్రారంభం దగ్గర నుంచి అంచనా వేసింది. ఇదే. వారి అంచనా నిజం కావడం అంటే బాధాకరం కదా. ఇంకేదైనా మ్యాజిక్ చేస్తారేమో అని ఓపెనింగ్ రోజు థియేటర్ కు వస్తే.. మ్యాజిక్ లు లేకపోగా లాజిక్ లు లేని సన్నివేశాలు, అవసరం లేని ఎలివేషన్స్ తో అదరగొట్టారు. దీనికి తోడు ఒకప్పుడు స్టార్ హీరోలందరి సినిమాకు బ్యాక్ బోన్ గా పనిచేసింది మణిశర్మ నేపథ్య సంగీతం. ఆయన తనయుడు అందించిన ఈ మూవీ సంగీతం పూర్తిగా తేలిపోయింది.

నీరసంగా ఉన్న పాటలు.. ఉస్సూరనిపించే నేపథ్య సంగీతం. అదే జైలర్ కు సాధారణమైన సీన్స్ ను కూడా హై మూమెంట్ వచ్చేలా నిలబెట్టింది నేపథ్య సంగీతం. అది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ తేలిపోయింది. కొత్తవారికి అవకాశాలివ్వాలనుకోవడం తప్పు కాదు. కానీ తనదైన అంచనా లేకుండా వాళ్లు ఇచ్చిన అవుట్ పుట్ ను అలాగే ఓకే చేయడం తప్పు. పైగా ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ చూసిన మెగాస్టార్.. బ్లాక్ బస్టర్ అన్నాడు అని మెహర్ రమేష్‌ చెబుతున్నాడు. అంటేతప్పు మెహర్ ది కాదు.. మెగాస్టార్ దే.. ముమ్మాటికీ ఈ ఫ్లాప్ కు చిరంజీవిదే బాధ్యత.

Related Posts