భోళా శంకర్ రిజల్ట్ ఉస్తాద్ టీమ్ కు ముందే తెలుసా..

భోళా శంకర్ .. మెగాస్టార్ మూవీ. ప్రారంభం నుంచీ ఏ దశలోనూ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను తెచ్చుకోలేకపోయింది. ఆల్రెడీ డబ్ అయిన తమిళ్ సినిమాను రీమేక్ చేయాలనుకోవడమే ఫస్ట్ మిస్టేక్ అంటే. ప్రేక్షకులు భయపడే దర్శకుడు మెహర్ రమేష్‌ ను తీసుకోవడం మరో మిస్టేక్ అంటూ అప్పట్లోనే కొందరు చెప్పుకున్నారు. బట్ ట్రైలర్ తో మాత్రం బజ్ క్రియేట్ అయింది. మెగా ఫ్యాన్స్ తో పాటు సెంటిమెంట్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుందనుకున్నారు.

బట్.. ఈ మూవీ విషయంలో మెజారిటీ ఆడియన్స్ అంచనాలే నిజమయ్యాయి. ఫ్యాన్స్ నుంచి కూడా డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఈ విషయం ఉస్తాద్ మూవీ టీమ్ కు ముందే తెలుసు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోన్న చర్చ. యస్.. లేదంటే మెగాస్టార్ తో పాటు ఇంకా స్టార్ అనే పదానికి దరిదాపుల్లో కూడా లేని శ్రీ సింహా సినిమా వేస్తారా..?


శ్రీ సింహా, కావ్య కళ్యాణ్‌ రామ్ జంటగా నటించిన సినిమా ఉస్తాద్. ఈ మూవీపై ముందు నుంచి కాస్త మంచి ఇంప్రెషన్ ఉంది. ఈ కుర్రాడి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నా.. ఈ ఉస్తాద్ మాత్రం కొంత వరకూ పాజిటివ్ టాక్ ఇప్పటికే తెచ్చుకుని ఉంది. పాటలు బావున్నాయి. టీజర్ ఇంప్రెస్ చేస్తే ట్రైలర్ ఆకట్టుకుంది. వెరసి ఈ చిత్రాన్ని ఈ శనివారం విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే మెగాస్టార్ భోళా శంకర్ తో పాటు సూపర్ స్టార్ జైలర్ కూడా ఉంది.

అయినా ధైర్యం చేసి మెగాస్టార్ లాంటి కొండను ఢీ కొట్టేందుకు సిద్ధం అయ్యారంటే వీరికి ఆల్రెడీ భోళా శంకర్ సినిమా రిజల్ట్ తెలుసు అనుకుంటున్నారు. పైగా ఒక రోజు ముందుగా మూవీ ప్రీమియర్స్ వేస్తున్నారు. అది కూడా బుకింగ్స్ పెద్దగా లేని ఐమాక్స్ లోనే కావడంతో అది కన్ఫార్మ్ అయింది. ఉస్తాద్ ను రిలీజ్ డే న కాకుండా భోళా శంకర్ తో పాటే శుక్రవారం ప్రీమియర్ వేస్తున్నారు. అంటే వీరి ధైర్యం మెహర్ రమేషా లేక.. ఈ సినిమా రిజల్ట్ ను ఎవరైనా ముందే లీక్ చేశారా అనేది తేలాలి.

Related Posts