‘కృష్ణమ్మ‘ అంటూ ఆకట్టుకుంటున్న ‘దుర్గమ్మ‘ గీతం

కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ.. విలక్షణంగా దూసుకెళ్తున్నాడు సత్యదేవ్. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ‘. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి గోపాలకృష్ణ ద‌ర్శక‌త్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుని మే 3న విడుదలకు ముస్తాబవుతోంది.

కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఏమవుతుందో మనలో‘ అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతానికి మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘దుర్గమ్మ‘ అంటూ సాగే పవర్ ఫుల్ డివోషనల్ సాంగ్ రిలీజయ్యింది. అనంత్ శ్రీరామ్ రచనలో సాకేత్ కోమండూరి ఈ పాటను ఆలపించాడు.

Related Posts