హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. అడ్డంగా బుక్కైన నటీమణి

గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో యూట్యూబర్ లిషి గణేష్ పేరు వినిపిస్తోంది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌ లో డ్రగ్స్‌ తీసుకున్న కొందరు యువకులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రముఖ బీజేపీ నేత కుమారుడు ఇచ్చిన పార్టీలో నటీమణి లిషి గణేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. లిషి గణేష్ ను పిలిచి విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.

గతంలో మింక్‌ పబ్‌ డ్రగ్‌ కేసులో లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణల్ని ఖండించింది. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్‌ పేరు రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో వినిపించడం గమనార్హం. లిషి గణేష్ తో పాటు శ్వేత అనే వీఐపీ పేరును ఎఫ్‌ఐఆర్‌ లో పోలీసులు చేర్చారు.

Related Posts