అల్లు అర్జున్‌ నా ఫేవరెట్ హీరో : భూతద్దం భాస్కర్‌ నారాయణ హీరోయిన్ రాశిసింగ్

రీసెంట్‌టైమ్‌లో యూనిక్‌ కంటెంట్‌తో రాబోతున్న మూవీ భూతద్దం భాస్కర్‌నారాయణ. క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ లో శివకందుకూరి హీరో కాగా రాశి సింగ్‌ ఫిమేల్ లీడ్ చేసింది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకుడు. మార్చి 1 న గ్రాండ్ గా రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు హీరోయిన్ రాశీ సింగ్‌.
చిన్నప్పటి నుంచి హీరోయిన్‌ కావాలనే లక్ష్యం ఉండేదన్నారు. హీరోయిన్‌ కాకముందు ఎయిర్‌ హోస్టెస్ గా పనిచేసానన్నారు రాశి సింగ్‌. సంతోష్‌ శోభన్‌తో ప్రేమ్‌కుమార్, ఆహాలో పాపం పసివాడు చేసానన్నారు. ఇప్పుడు భూతద్దం భాస్కర్‌నారాయణతో ముందుకు రాబోతున్నానని చెప్పారు రాశిసింగ్. ముంబై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అయినట్టు చెప్పారు రాశిసింగ్.
తెలుగు మాట్లాడగలిగే కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారు ఈ సినిమా మేకర్స్‌. అనుకోకుండా ఆడిషన్‌ కి వెళ్లిన నాకు ఈ సినిమా చాన్స్ వచ్చిందన్నారు.
ఇందులో సస్పెన్స్ థ్రిల్ రోమాన్స్ పాటలు అన్నీ వున్నాయి. ఇందులో రిపోర్టర్ గా కనిపిస్తాను. తర్వాత ఏం జరుగుతుందనే సస్పన్స్ ఇందులో ఆద్యంతం వుంటుందన్నారు.
శివ గొప్ప వ్యక్తిత్వం, వినయం గల హీరో అన్నారు. పురుషోత్తం రాజ్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయన విజన్ చాలా క్లియర్ గా వుంటుందన్నారు. అలాగే చాలా యంగ్ ప్రొడ్యూసర్స్. సినిమా అంటే పాషన్ వుంది. చాలా సపోర్ట్ ఇచ్చారు. రాజీపడకుండా ఖర్చు చేసి గ్రాండ్ గా నిర్మించారని చెప్పుకొచ్చారు హీరోయిన్ రాశిసింగ్.
తన ఫేవరెట్‌ హీరో అల్లు అర్జున్ గారనీ… ఆర్య 2 చూసి ఆయన ఫ్యాన్ అయిపోయానన్నారు. తన అప్‌కమింగ్ మూవీస్‌ గురించి చెప్తూ..
సుహాస్ గారితో చేసిన ప్రసన్న వదనం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నారు.

Related Posts