కోలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్టయ్యింది

కోలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. స్టార్ హీరో సూర్య తో విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోని న్యూ వేవ్ డైరెక్టర్స్ లో కార్తీక్ సుబ్బరాజ్ ఒకడు. ఇతను తీసిన ‘పిజ్జా‘ సినిమాతోనే విజయ్ సేతుపతి హీరోగా పరిచయమయ్యాడు. ‘జిగర్తాండ‘తో మరో నటుడు బాబీ సింహా వెలుగులోకి వచ్చాడు. అలాగే.. సూపర్ స్టార్ రజనీకాంత్ తోనూ ‘పేట‘ సినిమా చేశాడు కార్తీక్ సుబ్బరాజు. ఇక.. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్‘ తర్వాత ఇప్పుడు సూర్య తో కొత్త సినిమాని ప్రకటించాడు.

మరోవైపు సూర్య ‘కంగువ‘ని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత సుధా కొంగర, వెట్రిమారన్ సినిమాలు కూడా పైప్ లైన్లో ఉన్నాయి. లేటెస్ట్ గా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని హీరో సూర్య, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. సూర్య 44వ చిత్రంగా తెరకెక్కే ఈ మూవీలో లవ్, ఎంటర్ టైన్ మెంట్, వార్ అనే అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయట. త్వరలోనే ఈ సినిమా అదికారికంగా ముహూర్తాన్ని జరుపుకోనుంది.

Related Posts