మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీ గాడ్ ఫాదర్ విషయంలో ఫ్యాన్స్ లో ఓ అసంతృప్తి ఉంది. ఈ మూవీలో హీరోయిన్ లేదు. అంతకు ముందు వచ్చిన ఆచార్యలోనూ హీరోయిన్ లేదు కానీ.. కాస్త డ్యాన్సులున్నాయి. ఆచార్య కంటే ముందు వచ్చిన సైరా పూర్తిగా డిఫరెంట్ మూవీ. దీంతో ఆయన్నుంచి ఫ్యాన్స్ ఆశించే అంశాలు లేని సినిమాలే ఈ మూడూ. వారి అసంతృప్తిని తెలుసుకున్న మెగాస్టార్ ఈ సారి వింటేజ్ లుక్ తో పూర్తిగా ఊరమాస్ మూవీ వాల్తేర్ వీరయ్యగా వస్తున్నాడు.

వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో ఆయన ఓ జాలరి పాత్రలో నటించాడు. మాస్ మహరాజ్ రవితేజ ఓ కీలక పాత్ర చేశాడు. పవర్, జై లవకుశ ఫేమ్ బాబీ (రవీంద్ర) డైరెక్ట్‌ చేసిన సినిమా ఇది. ఈ సంక్రాంతికి జనవరి 13న విడుదల కాబోతోంది. అయితే వాల్తేర్ వీరయ్య కథ ఇదే అంటూ ఓ న్యూస్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇది తెలంగాణ రాకముందు కాలంలో సాగే కథ అనేది రవితేజ టీజర్ తో తేలిపోయింది.


వీరయ్య(చిరంజీవి) వైజాగ్ లో ఉంటూ సముద్రంలో వేట చేస్తుంటాడు. ఈ వేటలో వీరయ్య చాలా పెద్ద ఎక్స్ పర్ట్. భారీ తుఫాన్స్ లో సైతం తన షిప్ ను పర్ఫెక్ట్ గా హ్యిండిల్ చేయగలడు. ఇక తమ చేపల విషయంలో లోకల్ గా ఉండే విలన్స్ తో గొడవ ఉంటుంది. వీటికి మించి ఆయన ఓ స్మగుల్ గూడ్స్ ను నేవీ వాళ్లకు దొరక్కుండా అత్యంత చాకచక్యంగా తీసుకువస్తుంటాడు. అలా ఓ సారి ప్రభుత్వానికి సంబంధించి ఓ పెద్ద మాల్ ను తను తీసుకువెళతాడు. అలా పోలీస్ లకూ సవాల్ గా మారతాడు. బట్.. వీరయ్యను పట్టుకునేందుకు ఎవరూ సరైన ఆధారాలు తీసుకురాలేకపోతారు.

అప్పుడు చాలా సిన్సియర్ అయిన పోలీస్ ఆఫీసర్(రవితేజ)ను అతన్ని పట్టుకునేందుకు అపాయింట్ చేస్తారు. అలా వైజాగ్ లో ఎంటర్ అయిన రవితేజ వీరయ్య మైనస్ లన్నీ తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతాడు. కానీ చివర్లో వీరయ్య అదంతా చేస్తున్నది తన కోసం కాదని తెలుసుకుని.. ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి.. వీరయ్యను అరెస్ట్ నుంచి తప్పిస్తాడు.. ఇదే వాల్తేర్ వీరయ్య కథ అంటూ ఈ వార్త హల్చల్ చేస్తోంది. దీంతో పాటు ఈ కథలో గతంలో మణిరత్నం రూపొందించిన ఘర్షణ ప్లాట్ కూడా కనిపిస్తుందట. చిరంజీవి, రవితేజ ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు.

వారి తల్లులు వేరు. రవితేజ తన తల్లి వద్ద తెలంగాణ(అందుకే రవితేజకు ఈ స్లాంగ్ పెట్టారు)లో పెరుగుతాడు. అలా ఇద్దరి మధ్యా ఓ వ్యక్తిగత వైరం కూడా ఉంటుంది. ఆ వైరం వల్లే వీరయ్యను పట్టుకోవడానికి అపాయింట్ చేయగానే హైదరాబాద్ నుంచి అతను పగ తీర్చుకోవచ్చు అనే ఉద్దేశ్యంతోనే వైజాగ్ వెళతాడు. కానీ చివర్ లో ఓ నిజం తెలుసుకుని.. వీరయ్యను తప్పించడమే కాదు.. తన అన్నగా అంగీకరిస్తాడు. అనే కోణం కూడా ఉంటుందట.


మరి నిజంగా కథ ఇదే అయితే కొత్తదనం పెద్దగా లేదు కానీ.. దర్శకుడు బాబీ మాస్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి ఇద్దరు హీరోల ఇమేజ్ లకు అనుగుణంగా కథనం రాసుకుని ఉంటే ఖచ్చితంగా సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్ అవుతుందనే చెప్పొచ్చు.