వారం పాటు వాయిదాపడ్డ సత్యదేవ్ ‘కృష్ణమ్మ‘

విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ‘. ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తుండడం విశేషం. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు.

‘కృష్ణమ్మ‘ సినిమాలో సత్యదేవ్ మాస్ లుక్ లో మెస్మరైజ్ చేయబోతున్నాడు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘కృష్ణమ్మ‘పై మంచి బజ్ ఏర్పడింది. అసలు మే 3న విడుదల కావాల్సిన ‘కృష్ణమ్మ‘ వారం పాటు ఆలస్యంగా మే 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

Related Posts