భారీ బడ్జెట్ తో బెల్లంకొండ సినిమా

డెబ్యూ మూవీ ‘అల్లుడు శీను‘ నుంచి పోయినేడాది వచ్చిన ‘ఛత్రపతి‘ వరకూ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఈ చిత్రాలతో మంచి స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తన సినిమాల హిందీ అనువాదాలతో నార్త్ బెల్ట్ లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అందుకే.. బెల్లంకొండ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు‘ సినిమా సెట్స్ పై ఉంది. ఈ చిత్రం తర్వాత ‘చావు కబురు చల్లగా‘ డైరెక్టర్ తో ‘కిష్కింద పురి‘ అనే మరో మూవీ చేస్తున్నాడు.

వీటితో పాటు.. మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టాడట బెల్లంకొండ. వాటిలో ఒక సినిమా అయితే రూ.50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందట. లుధీర్ బైరెడ్డి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ, అడ్వంచర్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కనుందట

Related Posts