భగత్ సింగ్ లాంటి విప్లవ వీరుడుని భవదీయుడుగా మార్చాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న సినిమాకు యేడాది క్రితమే ఈ టైటిల్ పెట్టాడు. అప్పట్లోనే అభ్యుదయ వాదులంతా హరీష్ శంకర్ ను విమర్శించారు. ఇలాంటి టైటిల్ పెట్టి భగత్ సింగ్ ను అవమానించారు అన్నారు. అయినా హరీష్ కానీ, పవన్ కానీ తగ్గలేదు. ఈ లోగా అసలు సినిమా పట్టాలెక్కడమే పెద్ద డౌట్ అనుకున్నారు.

పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం హరీష్ శంకర్ చాలాకాలంగా బూట్లు అరిగేలా తిరుగుతున్నాడు. అతను మాత్రం కరుణించలేదు. ఈ లోగా కొన్నాళ్ల క్రితం భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను ఆపేశారనీ.. పవన్ కళ్యాణే ఓ కొత్త చెప్పి దాన్ని డెవలప్ చేయమని హరీష్ చెప్పాడు.. హరీష్ ఆ పనిలోనే ఉన్నాడు అనే వార్తలు వచ్చాయి. అంతా ఇది నిజమే అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చి కొత్త పోస్టర్ వదిలాడు హరీష్ శంకర్. పైగా మూవీని లాంఛనంగా ప్రారంభించారు కూడా. అయితే ఈ హడావిడీ అంతా అభిమానుల్లో కొంత గందరగోళానికి, కొత్త అనుమానాలకు తావిస్తోంది.


నిజానికి కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ నాలుగైదేళ్ల క్రితం తమిళ్ లో వచ్చిన తెరి అనే సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ చిత్రం తెలుగులో ఆల్రెడీ పోలీసోడుగా డబ్ అయింది కూడా. అలాంటి మూవీని రీమేక్ చేయడం అంటే మరో కాటమరాయుడుని చూపడమే అవుతుందని ఫ్యాన్స్ అంతా గోల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారి గోలను పట్టించుకోకుండా మైత్రీ మూవీస్ బ్యానర్ లో తెరి కథనే హరీశ్ శంకర్ తో చేయబోతున్నాడని తెలిసింది.

దీంతో కొంతమంది తెరిని రీమేక్ చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటాం అని బెదిరింపులు లేఖలు కూడా వదిలారు. కానీ పవన్ పట్టు వదలడం లేదనీ.. అందుకే వారిని డైవర్ట్ చేయడానికే హరీశ్ శంకర్ ఈ ఉస్తాద్ టైటిల్ ను వదిలాడని చెప్పుకుంటున్నారు.

నిజమే.. ఆగిపోయిందనుకున్న సినిమా మళ్లీ ప్రారంభం అయితే.. తెరి రావడం లేదనే అభిమానులు భావిస్తారు. తర్వాత వీళ్లు తీరిగ్గా తమ పని తాము చేసుకోవచ్చు అనుకున్నట్టుగా ఇండస్టీలో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా అభిమానుల మనో భావాలతో ఆడుకుంటే అది ఫైనల్ గా హరీశ్ శంకర్ కే మైనస్ అవుతుంది.