ఆలియా పెళ్లి గురించి అడిగితే.. అలా చెప్పిందేంటి..?

రణబీర్ కపూర్, అలియాభట్ ల ప్రేమాయణం గురించి అంద‌రికీ తెలిసిందే. వీళ్లిద్ద‌రూ ల‌వ్ లో ఉన్నార‌ని ఆత‌ర్వాత డిఫ‌రెన్స‌స్ వ‌చ్చాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ.. అది వాస్త‌వం కాదు అనేది తెలిసిందే. ఇటీవ‌ల‌ విక్కీ కౌశ‌ల్, క‌త్రినాకైఫ్ పెళ్లి చేసుకున్న‌ప్ప‌టి నుంచి ఆలియా, ర‌ణ‌భీర్ పెళ్లి గురించి ఆరా తీయ‌డం ఎక్కువైంది. డిసెంబ‌ర్ లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవ‌డం ఖాయం అని గ‌ట్టిగా వినిపిస్తోంది కానీ.. డిసెంబర్ మిడ్ కి వచ్చేసినా ఆలియా, ర‌ణ‌భీర్ ల‌ పెళ్లి సంగతి మాత్రం బయటకు రాలేదు.

ప్రస్తుతం ఈ ల‌వ్ బ‌ర్డ్స్ ఇద్దరు బ్రహ్మస్ర్త సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా టీమ్ హైద‌రాబాద్ రావ‌డం జ‌రిగింది. మీడియాతో ఇంట్రాక్ట్ అయిన‌ప్పుడు ఇంత‌కీ పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదురైంది. దీనికి వెంట‌నే రణబీర్, అలియా వైపు చూసి పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించాడు.? దానికి అలియాభ ట్ నన్ను అడుగుతావేంటి.? నాకేం తెలుసు అన్నట్లు ముఖం పెట్టింది. ఈ సన్నివేశాన్ని బట్టి ఈ జంట ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనట్లు తేలిపోయింది.

అయితే.. రణబీర్ క‌పూర్ ఆలియాను జోక్ గా అడిగాడా..? అందుక‌నే ఆలియా అలా స్పందించిందా..? అనేది ఆస‌క్తిగా మారింది. అలాగే త‌న‌కు పెళ్లి చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయాల‌ని ఉంద‌ని కూడా చెప్పాడు. దీంతో ఆలియానే ఆల‌స్యం చేస్తుంద‌ని అర్ధం అవుతుంది. మ‌రి.. ఆలియా మ్యారేజ్ కి ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందో చూడాలి.

Related Posts