నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన “పుష్ప‌”

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక జంట‌గా న‌టించిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ చిత్రానికి క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిసెంబ‌ర్ 17న పుష్ప ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకి ఫ‌స్డ్ డే ఎలాంటి స్పంద‌న వ‌చ్చిందో.. టిక్కెట్ల కోసం ఎంత డిమాండ్ ఏర్ప‌డిందో అంద‌రికీ తెలిసిందే. దీంతో పుష్ప ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేసింది అనేది ఆస‌క్తిగా మారింది.

అయితే.. ఈ సినిమా విడుదలకు ముందే నైజాంలో రికార్డు కలెక్షన్ వస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేయ‌డం జ‌రిగింది. దానిని నిజం చేస్తూ.. నైజాంలో పుష్ప రాజ్ దుమ్ము లేపాడు అని చెప్ప‌చ్చు. ఇంత‌కీ నైజాంలో ఎంత కలెక్ట్ చేసిందంటే.. తొలి రోజు ఆల్ టైం రికార్డు షేర్ 11.44 కోట్లు రాబట్టింది. ఇది ఆల్ టైం రికార్డు అని చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. దీనితో ఈ చిత్రం మొదటి రోజు లెక్కే ఆల్ టైం నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్పాలి.

అయితే.. ఓవ‌రాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎంత క‌లెక్ట్ చేసింది.? బాలీవుడ్ మ‌రియు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయ‌ళ భాష‌ల్లో ఎంత క‌లెక్ట్ చేసింద‌నేది తెలియాల్సివుంది. మొత్తానికి పుష్ప‌రాజ్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఫ‌స్ట్ వీక్ ఎంత క‌లెక్ట్ చేస్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది.