పవన్ కళ్యాణ్ కోసం రాక్ స్టార్ హీరోయిన్

పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో ఒక ఛాన్స్ వస్తే చాలని ఎగిరి గంతేసే భామలు చాలామందే ఉన్నారు. అలాంటిది హీరోయిన్ గానో లేక సెకండ్ హీరోయిన్ గానే అంటే కాదంటారా..? అందుకే వెంటనే ఓకే చెప్పిందీ రాక్ స్టార్ బ్యూటీ. ఇంతకీ ఇది ఏ సినిమాలో అంటారా..? హరిహరవీరమల్లు చిత్రంలో. ఆల్రెడీ ఈ చిత్రంలో పవన్ సరసన మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో పీరియాడిక్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో మరో హీరోయిన్ గా గతంలో బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్
ను తీసుకున్నారు. కానీ అమ్మడు ఈ మధ్య ఓ అవినీతి కేస్ లో ఇరుక్కుంది. పోలీస్ లు తన పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. తమ అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లొద్దని హుకుం జారీ చేశారు. దీంతో తమ షూటింగ్ కు ఇబ్బంది అవుతుందనుకున్నారో ఏమో.. ఆ భామ స్థానంలో రాక్ స్టార్ మూవీలో హీరోయిన్ గా నటించిన నర్గీస్ ఫక్రీని తీసుకున్నారు.
నర్గీస్ ఫక్రీకి రాక్ స్టార్ సూపర్ హిట్ గా నిలిచినా.. అమ్మడు మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లైనా తనదైన ముద్రను వేయలేకపోయింది. అందం, అది చూపే హొయలు ఉన్నా.. ఎందుకో నర్గీస్ ను బాలీవుడ్ పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. అందుకు కారణాలేవైనా.. ఈ అనుకోని అవకాశం అమ్మడికి సౌత్ డోర్స్ ఓపెన్ చేసింది. ఇలాంటి ఛాన్స్ కోసం తను కూడా చాలాకాలంగా చూస్తోందట. అలాంటిది ఏకంగా పవన్ సినిమాలో అవకాశం అంటే ఇంకా ఆగుతుందా.. అయితే ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. అందం పరంగా జాక్వలిన్ కంటే నర్గీస్ చాలా బెటర్.

Related Posts