తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా?

నేటితరం సీనియర్ బ్యూటీస్ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ముఖ్యంగా పదేళ్ల క్రితం సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అనతికాలంలోనే అగ్రపథానికి దూసుకెళ్లిన ఒకేతరం నటీమణులు ఇలియానా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు ఇంచుమించు చాలా తక్కువ సమయంలోనే పెళ్లి పీటలెక్కారు. ఇప్పుడు వారి తరానికే చెందిన తాప్సీ కూడా తాజాగా పెళ్లిపీటలెక్కిందనే ప్రచారం బాలీవుడ్ లో జోరందుకుంది.

తమ ప్రైవేట్ ఈవెంట్స్ ను ఎంతో పర్సనల్ గా భావించే తాప్సీ.. తన ప్రియుడు, పెళ్లి విషయాలను మీడియాకి లీక్ చేయకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మథియాస్‌ బో తో తాప్సీ రిలేషన్ షిప్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. తాప్సీ, మథియాస్ వివాహం చేసుకోబోతున్నట్లుగానూ వార్తలొచ్చాయి. అయితే.. తాజాగా వీరి పెళ్లి అయిపోయిందనేది బీటౌన్ టాక్.

కేవలం అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో తాప్సీ, మథియాస్ వివాహ బంధంతో ఒక్కటయ్యారనే ప్రచారం జరుగుతుంది. ఈ నెల 20నే వీరి పెళ్లి పనులు అత్యంత గోప్యంగా మొదలయ్యాయని.. మార్చి 23న వీరి వివాహం జరిగినట్టు ఆ ప్రచార సారాంశం. మరి.. తాప్సీ, మథియాస్‌ తమ పెళ్లి విషయంపై ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Related Posts