రెండున్నరేళ్ల అద్భుతమైన జర్నీ ‘ఊరిపేరు భైరవకోన’

సందీప్‌కిషన్‌, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ మెయిన్‌లీడ్‌తో డిఫరెంట్ చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించిన చిత్రం ఊరిపేరు భైరవకోన. ఈ చిత్రం ఫిబ్రవరి 16 న రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా… ప్రెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.


ఈ చిత్రం నిర్మించిన అనిల్‌ సుంకర గారితో ఎంతో అనుబందం ఉంది.. సాధారణంగా ఆయన పేరు నిర్మాతగా వేసుకోరు.. నేను పట్టుబట్టి నిను వీడని నీడను నేనే చిత్రానికి నిర్మాతగా పేరు వేయించానన్నారు సందీప్‌ కిషన్‌. ఇంత మంచి చిత్రంలో నేను హీరోగా చేయడం, విఐ ఆనంద్ నాకు ఈ చిత్రాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండున్నరేళ్లు కష్టపడి పనిచేసామన్నారు సందీప్‌ కిషన్‌.


ఈచిత్రం ఓ అద్భుతమైన జర్నీ అన్నారు దర్శకుడు విఐ ఆనంద్. ప్రతీ మూమెంట్ మాకు స్పెషల్ గా నిలిచిందన్నారు. సూపర్‌ నేచురల్ ఫాంటసీ, సూపర్బ్ లవ్‌స్టోరీతో పాటు కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అన్నారు విఐ ఆనంద్.


రు పేరు భైరవకోన టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు సందీప్, దర్శకుడు, టీం అంతా పడిన శ్రమ అర్ధమౌతుంది. సినిమా చూశాను. దర్శకుడు ఆనంద్ చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడన్నారు నిర్మాత అనిల్‌సుంకర.
డుదలైన రెండు పాటలని గొప్ప గా హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిజమేనే, హమ్మ హమ్మ పాటలని ప్రేక్షకులు వోన్ చేసుకొని రీల్స్ చేస్తూ గొప్ప ఆదరణ చూపించారు. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వచ్చిందన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర.

Related Posts