పూర్తి డిఫరెంట్‌ లుక్‌లో రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’

మాస్‌రాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా.. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ నామ్‌ తో సునా హోగా అనేది ట్యాగ్‌లైన్‌ గా పెట్టారు.
ఈ చిత్రం కీలక షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఈగల్‌ సక్సెస్‌ ను మిస్టర్‌ బచ్చన్‌ టీమ్‌ సెలబ్రేట్ చేస్తోంది. ఈగల్‌లో డిఫరెంట్ గెటప్ ట్రై చేసిన రవితేజ మిస్టర్‌ బచ్చన్‌లో పూర్తి డిఫరెంట్‌లుక్‌లో కనిపించబోతున్నారు.


వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

Related Posts