ఈగల్‌ సక్సెస్ మీట్

మాస్‌ రాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ మెయిన్‌ లీడ్‌లో కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజి విశ్వప్రసాద్‌, వివేక్ కూచిబొట్ట నిర్మించిన స్టైలిష్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈగల్‌’. ఈసినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఈగల్‌ సక్సెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.


ఈ సినిమాలో నా గెటప్‌కు మంచి ప్రశంసలు వస్తున్నాయి.. కాళికాదేవి ఎపిసోడ్‌లో నేనేనా అనిపించింది. ఆర్టిస్ట్‌లందరూ బాగా చేసారు. కార్తీక్‌ ఘట్టమనేని అద్భుతంగా తీసారు. త్వరలో హరీష్‌శంకర్‌తో మిస్టర్‌ బచ్చన్‌ హిట్ కొట్టబోతున్నామన్నారు హీరో రవితేజ.


ఎప్పటినుంచో స్టైలిష్‌ యాక్షన్‌ మూవీ తీయాలనుకున్నాను. దానికి మీనింగ్ యాడ్ చేసి తీయగలగడం రవితేజ గారి స్టార్‌డమ్‌ బాగా ఉపయోగపడిందన్నారు డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని.


ఈగల్ అద్భుతమైన చిత్రం. మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇలాంటి పాయింట్ ని ఇంత స్టయిల్ గా తీయడం కార్తిక్ కే సాధ్యపడింది. డేవ్ జాండ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ధమాకా, ఈగల్, ప్రస్తుతం నేను చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ ఇలా మూడు డిఫరెంట్ సినిమాలు రవితేజ గారికి అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ధన్యవాదాలు. అన్నారు హరీశ్‌ శంకర్.పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్.. కావ్య థాపర్‌ ఇతర ఆర్టిస్ట్‌లు ఈ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసారు.

Related Posts