‘యాత్ర 2‘ టీజర్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

2019 ఎన్నికల సమయానికి రెండు నెలల ముందు ‘యాత్ర‘ సినిమా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ దివంగ‌త ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ మహి.వి.రాఘవ్. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ‘యాత్ర 2‘ రాబోతుంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. ‘యాత్ర‘ సినిమాలో రాజశేఖర్ రెడ్డి గా కనిపించిన మమ్ముట్టి సీక్వెల్ లోనూ అదే పాత్రలో అలరించనున్నాడు. జగన్ పాత్రను తమిళ నటుడు జీవా పోషిస్తున్నాడు.

త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘యాత్ర 2‘ మూవీ టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్సయ్యింది. జనవరి 5న ఉదయం 11 గంటలకు ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో వై.ఎస్.ఆర్ పాత్రలో మమ్ముట్టి.. జగన్ గా జీవా ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రను మహేష్ మంజ్రేకర్ పోషిస్తున్నాడు. ఫిబ్రవరి 8న ‘యాత్ర 2‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts