సంక్రాంతి నుంచి తప్పుకున్న ఆ రెండు చిత్రాలు?

ఈసారి సంక్రాంతి సమరం చాలా రసవత్తరంగా సాగబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు.. తెలుగు నుంచి ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇవి చాలవన్నట్టు అనువాద రూపంలో తమిళ నుంచి ‘లాల్ సలామ్, కెప్టెన్ మిల్లర్, అయలాన్‘ వంటి మరో మూడు చిత్రాలు సంక్రాంతినే టార్గెట్ చేశాయి. అయితే.. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమవుతోన్న సినిమాల్లో ‘కెప్టెన్ మిల్లర్, అయలాన్‘ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

తమిళ నటులు ధనుష్, శివ కార్తికేయన్ సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తుంటోంది. ధనుష్ అయితే ‘సార్‘ వంటి స్ట్రెయిట్ మూవీతో ఇక్కడ బడా హిట్ కొట్టాడు. ఇక మిగతా సీజన్లను పక్కనపెడితే సంక్రాంతి సమరం సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పాలి. సంక్రాంతి బరిలో ఎక్కువగా తెలుగు సినిమాలకే ప్రయారిటీ ఇస్తారు మేకర్స్. అందుకే.. తమ చిత్రాలను తమిళం వరకూ విడుదల చేసుకుని.. తెలుగులో మాత్రం సంక్రాంతి సమరం చల్లారాక రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట ధనుష్, శివకార్తికేయన్.

Related Posts