ప్రమోషన్స్ తో ప్రపంచాన్ని చుట్టేస్తోన్న కమల్ హాసన్

లోక నాయకుడుగా దేశవ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ యాక్టర్ కమల్ హాసన్. ఆయన చేసిన ప్రయోగాలు ప్రపంచ సినిమా చరిత్రలోనే మరే నటుడూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇమేజ్ తో సంబంధం లేకుండా అభిమానులున్నారు ఆయనకు. అయితే ఇలాంటివి ఎన్ని చెప్పినా అలాంటి హీరోలు హిట్స్ కూడా కొడుతుంటే ఫ్యాన్స్ లో జోష్ పెరుగుతుంది. మరోవైపు తన తరం హీరోలు హిట్స్ తో పనిలేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నా.. కమల్ హాసన్ నుంచి కాస్త వేగం తగ్గింది. బట్ లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా ఈ సారి విక్రమ్ గా రాబోతున్నాడు. మూడు సినిమాలతోనే మోస్ట్ వాంటెడ్ అనిపించుకున్న లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అనౌన్స్ మెంట్ ను ట్రైలర్ వరకూ మోస్ట్ ప్రామిసింగ్ అనిపించుకున్న ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అందుకే ప్రమోషన్స్ ను కూడా ఆ రేంజ్ లోనే ప్లాన్ చేశాడీ లోకనాయకుడు. ఇందుకు సంబంధించిన ప్రమోషనల్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది టీమ్.

ఈ నెల 26 నుంచి విక్రమ్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆ రోజు ఢిల్లీ టీమ్ అంతా ప్రమోషన్స్ మొదలుపెడుతుంది. ఆ తర్వాత రోజు 27న కేరళలోని కొచ్చిన్ లో విక్రమ్ సందడి ఉంటుంది. 28న కేరళలోనే మళయాలంలో వస్తోన్న బిగ్ బాస్ షోలో టీమ్ పార్టిసిపేట్ చేస్తుంది. అంటే మళయాలీలకు విక్రమ్ రెండు రోజుల పాటు వినోదం పంచబోతున్నాడు.
29న మలేసియా కౌలాలంపూర్ లో ప్రమోషన్స్ చేస్తారు. మలేసియాలో తమిళియన్ జనాభా చాలామంది ఉంటారు. అందుకే చాలా తమిళ్ సినిమాలు మలేసియాలో విడుదలవుతాయి. ఇక స్టార్స్ మూవీస్ అయితే మస్ట్. అందుకే అక్కడా ప్రమోషన్స్ భారీగానే నిర్వహించబోతోంది టీమ్. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చేస్తారు.

31న హైదరాబాద్ లో మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతోంది. ఈ ఈవెంట్ కు చాలామంది సీనియర్ హీరోలు అటెండ్ అవుతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక హైదరాబాద్ నుంచి చివరగా జూన్ 1న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా చేరుకుంటుందీ మూవీ టీమ్. బుర్జ్ ఖలీఫాలో లోకనాయకుడి సందడితో ప్రమోషన్స్ ముగుస్తాయి. ఇక జూన్ 3నుంచి విక్రమ ఊచకోత మొదలవుతుందన్నమాట. ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత భారీ అంచనాలు విక్రమ్ పై ఉన్నాయి. మరి వాటిని కమల్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Related Posts