నాగచైతన్య దారిలో పడ్డట్టేనా..?

అక్కినేని నాగ చైతన్య.. క్లాస్ హీరోగా తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నాడు. నిజానికి ఈ విజయాలు అతనికి గతంలోనే రావాల్సి ఉంది. అప్పట్లో మాస్ ఇమేజ్ కోసమని లేనిపోని కథలు ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. అప్పట్లోనే తను ఈ ఇమేజ్ కే సూట్ అవుతానని చైతూ గుర్తించినా.. నాగార్జునకు అర్థమైనా చే ఇమేజ్ ఇప్పుడు మరో రేంజ్ లో ఉండేది అనేది నిజం. ఏమైతేనేం.. తన పర్సనాలిటీ తగ్గ కథలతో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు. మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ కు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థ్యాంక్యూ అనే సినిమా చేసి ఉన్నాడు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ కూడా వెరీ ఇంప్రెసివ్ గా ఉంది. అతను గతంలో చేసిన మళయాల రీమేక్ ప్రేమమ్ ను గుర్తుకు తెస్తున్నా.. చైతూ ఇమేజ్ కు ఇలాంటి కథలను పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. అందుకే చాలామంది థ్యాంక్యూ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

థ్యాంక్యూ మూవీ జూలై 8న విడుదల కాబోతోంది. ఆ తర్వాతి నెలలోనే తన బాలీవుడ్ డెబ్యూ మూవీ లాల్ సింగ్ ఛద్దా విడుదలవుతోంది. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఆమిర్ ఖాన్ నటించిన సినిమా కాబట్టి మాగ్జిమం హోప్స్ పెట్టేసుకోవచ్చు. పైగా చైతూదే ఏదో కేమియో రోల్ లాంటిది కాక కాస్త బలమైన ఎమోషన్స్ ఉన్న పాత్రే అంటున్నారు. యంగ్ ఇండియన్ ఆర్మీ మేన్ గా చైతూ ఈ చిత్రంలో కనిపిస్తాడు. మరోవైపు విక్రమ్ కుమార్ తోనే దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రాబోతోంది. ఈ తరహా కథ చేయడం నాగచైతన్యకు ఇదే ఫస్ట్ టైమ్.

మరోవైపు తమిళ్ లో మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న వెంకట్ ప్రభు డైరెక్షన్ లోనూ సినిమా ఓకే అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ లైనప్ చూస్తోంటే చైతూ కెరీర్ లో కొత్త దశ మొదలైందేమో అనిపిస్తోంది. వరుసగా చేస్తోన్న ప్రాజెక్ట్స్ అన్నీ పాజిటివ్ వైబ్స్ తో కనిపిస్తున్నాయి. ఇక ఈ రేంజ్ లో టాప్ ప్లేస్ కు చేరుకునే అవకాశం ఉంది చైతూకు. �