అర్జున్ తో కాంట్రవర్శీపై స్పందించిన విశ్వక్ సేన్

యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురుని హీరోయిన్ గా పరిచయం చేస్తూ.. తన డైరెక్షన్ లోనే తెలుగులో ఆమధ్య ఒక చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ని హీరోగా తీసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ఆ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమయ్యింది. అన్ని ఏర్పాట్లు చేసుకుని షూటింగ్ కి వెళ్దామనుకునే సమయంలో విశ్వక్ సేన్ స్పందించలేదని అతనిపై ఆరోపణలు చేశాడు అర్జున్. విశ్వక్ సేన్ రెండు, మూడు సార్లు షూటింగ్ ని పోస్ట్ పోన్ చేశాడని.. చివరకు వస్తాడనుకున్న రోజు అన్ని ఏర్పాట్లు చేసుకున్నా.. అతను రాలేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు అర్జున్.

అర్జున్ కామెంట్స్ పై చాన్నాళ్లుగా వివరణ ఇవ్వని విశ్వక్ సేన్.. లేటెస్ట్ గా ఓ ఇంటర్యూలో ఈ కాంట్రవర్శీపై స్పందించాడు. తాను అర్జున్ తో ఒక్క రోజు షూటింగ్ వాయిదా వేయమన్నానని.. సినిమా చేయనని చెప్పలేదని.. విశ్వక్ తెలిపాడు. అయితే.. వాయిదా వేయమన్నందుకే.. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు అనేసారని.. తాను బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోనయితే అలా చేసేవారా? తీసుకున్న పారితోషికం కూడా రెట్టింపు వేసి తిరిగిచ్చేసానని విశ్వక్ సేన్ అన్నాడు. మరి.. విశ్వక్ సేన్ రిప్లై పై అర్జున్ ఏమంటారో చూడాలి.

Related Posts