ఒకే తేదీన పుట్టిన హాట్ బ్యూటీస్

డిసెంబర్ 5.. ప్రెజెంట్ టాలీవుడ్ హాట్ బ్యూటీస్ పాయల్ రాజ్ పుత్, నేహా శెట్టి పుట్టినరోజు. ‘ఆర్.ఎక్స్.100’ సినిమాతో టాలీవుడ్‌ లో ఓవర్‌ నైట్ స్టార్‌గా మారింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో బోల్డ్ లిప్‌ లాక్స్‌ తో కుర్రకారును కైపెక్కించింది ఈ పంజాబీ భామ. ఆ తర్వాత ‘వెంకీమామ, డిస్కోరాజా‘ వంటి చాలా సినిమాలే చేసింది. అయితే.. ఇటీవల విడుదలైన ‘మంగళవారం‘ మూవీ మళ్లీ పాయల్ కి మంచి కమ్ బ్యాగ్ గా నిలిచింది. ‘ఆర్.ఎక్స్.100‘ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మంగళవారం‘ మూవీలోనూ తన మార్క్ బోల్డ్ నెస్ తో రెచ్చిపోయింది.

పాయల్ తరహాలోనే తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేసిన మంగళూరు బ్యూటీ నేహా శెట్టి. పూరి దర్శకత్వం వహించిన ‘మెహబూబా‘తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా.. పోయినేడాది వచ్చిన ‘డిజె టిల్లు‘ ఈ ముద్దుగుమ్మకు మంచి విజయాన్నందించింది. ఈ సినిమాలో నేహా పోషించిన రాధిక క్యారెక్టర్ ఏ రేంజులో సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత ‘బెదురులంక 2012, రూల్స్ రంజన్‘ వంటి సినిమాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నేహా.. ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts